Mariana Varela And Fabiola Valentín Married: ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు! పెళ్లిచేసుకున్న బ్యూటీ క్వీన్స్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన జంట

ఇద్దరు అందాల భామలు ఒక్కటయ్యారు. 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలలో ఇద్దరు పోటీదారులు. మరియానా వరెలా (మిస్ అర్జెంటీనా), ఫాబియోలా వాలెంటిన్ (మిస్ ప్యూర్టో రికో)గా నిలిచారు. గతకొంతకాలంగా వీరు రహస్యంగా డేటింగ్ చేస్తూ వచ్చారు. తాజాగా వారు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ వివాహ బంధాన్ని తెలియజేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

Mariana Varela And Fabiola Valentín Married: ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు! పెళ్లిచేసుకున్న బ్యూటీ క్వీన్స్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన జంట

Miss Argentina, Miss Puerto Rico

Mariana Varela And Fabiola Valentín Married: మాజీ మిస్ అర్జెంటీనా, మాజీ మిస్ ప్యూర్టో రికో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలలో ఇద్దరు పోటీదారులు. మరియానా వరెలా (మిస్ అర్జెంటీనా), ఫాబియోలా వాలెంటిన్ (మిస్ ప్యూర్టో రికో)గా నిలిచారు. అయితే ఈవారం తాము సంబంధంలో ఉన్నామని, ఇటీవలే వివాహం చేసుకున్నామని వారు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Fabiola Valentín ? (@fabiolavalentinpr)

థాయిలాండ్‌లో 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో మరియానా వరెలా, ఫాబియోలా వాలెంటిన్ కలుసుకున్నారు. అక్కడ వారు వరుసగా అర్జెంటీనా, ప్యూర్టో రికోలకు ప్రాతినిధ్యం వహించారు. పోటీలో టాప్ 10లో స్థానం సంపాదించిన తర్వాత ఆ ఇద్దరు అందాల భామలు సోషల్ మీడియాలో సన్నిహిత స్నేహితులుగా మెలిగారు. బయట ప్రపంచానికి తెలియకుండా వారు గతకొంతకాలంగా రహస్యంగా డేటింగ్ చేస్తూవచ్చారు. ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ బంగిమలు, కౌగిలింతలు, షాంపైన్ టోస్ట్‌లు, బంగారం, వెండి కలర్ బెలూన్‌లతో “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అనే అర్థంతో సహా వారి సంబంధానికి సంబంధించిన క్షణాలను చూపించే ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోలను పోస్ట్ చేశారు.

అయితే, వారు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుచేసిన ఫొటోలలో ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లోని సిటీ కోర్ట్‌హౌస్ వెలుపల ఈ జంట ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 28న వారు వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. మా సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత మేము ఒక ప్రత్యేక రోజున తలుపులు తెరిచాము అనే క్యాప్షన్ స్పానిష్‌లో రాసిఉంది. అయితే, చాలామంది వారి అభిమానులు, సెలబ్రిటీలు వారేలా, వాలెంటైన్‌ల చిత్రమైన ప్రేమను అభినందించారు.