బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లిన యువతి పళ్లు పీకి, తల పగులగొట్టి దారుణ హత్య

బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లిన యువతి పళ్లు పీకి, తల పగులగొట్టి  దారుణ హత్య

కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన తల్లికి షాక్ తగిలినట్లైంది. బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి టెక్సాస్ నుంచి మెక్సికన్ బోర్డర్ సిటీలోని మాటమారోస్ కు వెళ్లిన లిజబెత్ ఫ్లోర్స్(23) అనే యువతి విగత జీవిగా కనిపించింది. ఆ డెడ్ బాడీని చూస్తుంటే పళ్లు అన్నీ బలవంతంగా పీకేసినట్లు స్పష్టమవుతోంది. ఆగష్టు 9న కనిపించకుండాపోయిన యువతి ఆగష్టు 11న దొరికింది.



తలకు తీవ్రంగా గాయాలతో పాటు ముఖాన్ని రాయికి గట్టిగా కొట్టినట్లు వెల్లడైంది. నుదురు పగలడంతో పాటు పళ్లు మొత్తం ఊడిపోయినట్లుగా తెలుస్తుందని విచారణ చేపట్టిన అధికారులు అంటున్నారు. కూతుర్ని పోగొట్టుకోవడం అంటే గుండెను కోల్పోయినట్లే అని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.



‘వాళ్లు నా కూతురు చేసిన పనికి చాలా బాధపడుతున్నాను. అలా చేసి నన్ను తీవ్రమైన మనోవేధనలో ముంచేశారు. దీనిపై యునైటెడ్ స్టేట్స్, మెక్సికో అధికారులు జోక్యం చేసుకుని సహాయం చేయాలని కోరారు. విచారణలో ఇప్పటి వరకూ ఎటువంటి వ్యక్తులను నిందితులుగా అనుమానించలేదని అధికారులు తెలిపారు.