కోటి యాబై లక్షల లాటరీ గెలిచింది.. టిక్కెట్ పోయింది

కోటి యాబై లక్షల లాటరీ గెలిచింది.. టిక్కెట్ పోయింది

Missouri Lottery: ఓ యువతి ఎంతో ఆశపడి కొనుక్కున్న లాటరీ టిక్కెట్ మిస్ అయింది కానీ తనకు ల్యాటరీ తగిలిన విషయం గుర్తుపట్టగలిగింది. కోటి 43లక్షల 53వేల 384 రూపాయలు గెలుచుకున్న జాక్‌పాట్ దక్కించుకోవడానికి మూడు వారాలపాటు పోరాడాల్సి వచ్చింది. వేనిస్‌విల్లేకు చెందిన పెర్ల్ ఎర్విన్ ఫ్యామిలీ బర్త్ డేలు రిప్రజెంట్ చేసేలా.. 30 సంవత్సరాలుగా షో మీ క్యాష్ గేమ్ ఆడింది.

జూన్ 25న కొత్తగా ఆడాలనుకుని కొత్త నెంబర్లు ట్రై చేసింది. ఈ సారి తన మనవళ్లు, మనవరాలి డేట్ ఆఫ్ బర్త్ లను గుర్తుంచుకుని అవే నెంబర్లు తీసింది. ఈ విన్నింగ్ నెంబర్లు మ్యాచ్ అయి ల్యాటరీ టికెట్ తగిలింది.

విన్నింగ్ నెంబర్లు ఫెమిలర్ గా అనిపించాయి. టిక్కెట్ కోసం ఇల్లు మొత్తం వెతికా. దొరకలేదు. ఆ తర్వాత అర్థమైంది టిక్కెట్ మిస్ అయిందని. 3వారాల పాటు వెతికిన తర్వాత టిక్కెట్ తీసుకుని మిస్సౌరీ ల్యాటరీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి కోటి 43లక్షల 53వేల 384రూపాయల ల్యాటరీ గెలవగలిగా అని విన్నర్ చెప్పింది.