Naked Balcony : ద్యావుడా.. పట్టపగలు బాల్కనీలో నగ్నంగా నిలబడి యువతుల ఫోజులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

వారంతా యువతులు. అందంగా ఉన్నారు. బాల్కనీలోకి వచ్చి నిల్చున్నారు. ఉన్నట్టుండి ఒంటి మీదున్న దుస్తులన్నీ విప్పేశారు. నూలు పోగు కూడా లేదు. నగ్నంగా నిల్చున్నారు. అంతేకాదు ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అదీ పట్టపగలే..

Naked Balcony : ద్యావుడా.. పట్టపగలు బాల్కనీలో నగ్నంగా నిలబడి యువతుల ఫోజులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Naked Balcony

Models Posed Naked on Dubai Balcony : కొందరు యువతులు పట్టపగలు బాల్కనీలో నిల్చుని ఒంటి మీద నూలుపోగు లేకుండా నగ్న ప్రదర్శన చేయడం కలకలం రేపింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ లోని మెరీనా ప్రాంతంలో ఓ పెద్ద అపార్ట్ మెంట్ ఉంది. కొంతమంది యువతులు ఆ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. శనివారం(ఏప్రిల్ 3,2021) వారు తమ బాల్కనీలోకి వచ్చారు. ఒంటి మీదున్న దుస్తులు తీసేసి నగ్నంగా నిల్చున్నారు. వారికి కొంత దూరంలో ఓ ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. యువతులు ఫొటోలకు ఫోజులిచ్చారు. డిఫరెంట్ యాంగిల్స్ లో ఆ ఫొటోగ్రాఫర్ వాటిని క్లిక్ మనిపించాడు.

Naked

Naked

అపార్ట్ మెంట్ పక్కనే ఉన్న మరో భవనం మీదున్న వారు ఇది చూసి షాక్ అయ్యారు. కొందరు.. నగ్న యువతుల ఫొటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమాచారం కాస్తా పోలీసులకు అందింది. దుబాయ్ దేశపు విలువలు, చట్టాలకు ఈ చర్యలు విరుద్ధమని క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆ యువతులను అరెస్ట్ చేశారు.

Image

ఎలాంటి సిగ్గు లేకుండా ఎంతో నిర్భయంగా నగ్నంగా బాల్కనీలో నిల్చోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ యువతులను అలా చూసిన వారికి దిమ్మతిరిగిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కఠినమైన చట్టాలు, ఆంక్షలు ఉన్న దుబాయ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అందరిని నిర్ఘాంత పరిచింది.

దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. యువతులతో పాటు ఫొటోగ్రాఫర్ ని మంగళవారం(ఏప్రిల్ 6,2021) అరెస్ట్ చేశారు. నేక్డ్ ఫొటో షూట్ లో భాగంగా ఆ యువతులు ఇదంతా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సుమారు 18మంది విదేశీ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులు ఉక్రెయిన్ దేశానికి చెందిన మోడల్స్. వారికి రష్యన్ సిటిజన్ షిప్ ఉంది. దుబాయ్ లో కఠినమైన ఆంక్షలు ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో కిస్ చేయడం కూడా ఆ దేశంలో నేరమే. అలా చేస్తే జైలుకి పంపిస్తారు. అలాంటి దేశంలో ఏకంగా 18మంది యువతులు నగ్నంగా నిల్చుని ఫొటోలకు ఫోజులివ్వడం పెద్ద దుమారమే రేపింది.