Sri Lanka: అదానీకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని మోదీ ఒత్తిడి తెచ్చారంటోన్న శ్రీలంక అధికారి

ఇండియన్ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుకు 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని అంటున్నారు శ్రీలంక ఉన్నతాధికారి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని శుక్రవారం పేర్కొన్నారు.

Sri Lanka: అదానీకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని మోదీ ఒత్తిడి తెచ్చారంటోన్న శ్రీలంక అధికారి

Sri Lanka

 

 

Sri Lanka: ఇండియన్ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుకు 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని అంటున్నారు శ్రీలంక ఉన్నతాధికారి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని శుక్రవారం పేర్కొన్నారు. కామెంట్ చేసిన కాసేపటికి ఆ అధికారి తర్వాత తన మాటను ఉపసంహరించుకున్నారు.

గోటబయ కార్యాలయం కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. శ్రీలంకలోని ఉత్తర మన్నార్ జిల్లాలో 500 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు అపప్పగించారని ముందుగా కామెంట్ చేశారు.

శుక్రవారం కొలంబోలోని పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరైన శ్రీలంక సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సిఇబి) ఛైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో, రాజపక్సేతో తన సంభాషణ సందర్భంగా, ప్రాజెక్టును అదానీకి అప్పగించాలని మోదీ తనపై ఒత్తిడి తెచ్చారని అధ్యక్షుడు తనతో చెప్పారని పేర్కొన్నారు.

Read Also: మా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం 2024 వ‌ర‌కు కొన‌సాగొచ్చు: శ్రీ‌లంక ప్ర‌ధాని

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ (COPE)ని ఉద్దేశించి మాట్లాడిన ఫెర్డినాండో.. రాజపక్సే తాను మోదీ నుండి ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారని అన్నాడు. ఈ ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని రాష్ట్రపతి కోరినట్లు సీనియర్ అధికారి కమిటీకి తెలిపారు.

రాజపక్సే, ఫెర్డినాండో అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత రాష్ట్రపతి ఆయనను పిలిపించి కాసేపటి వరకూ మాట్లాడారు. అయినప్పటికీ ఫెర్డినాండో తన ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకున్నారు.