Chile: రోడ్డుపై నోట్ల వర్షం.. సొంతం చేసుకోవడానికి ఎగబడ్డ వాహనదారులు

కొందరు దొంగలు శుక్రవారం సాయంత్రం ఆ కేసినోలోకి ప్రవేశించి, అక్కడున్నవారిని తుపాకీతో బెదిరించి, భారీగా సొమ్మును చేజిక్కించుకుని, తమ కారులో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగలను వెంటాడారు. ఆ దొంగలు చిలీలోని నార్త్ కోస్టల్ హైవేపైకి పోగలిగారు. విపరీతమైన వేగంతో కారును నడిపారు. అయినా పోలీసులు వారిని వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నారు

Chile: రోడ్డుపై నోట్ల వర్షం.. సొంతం చేసుకోవడానికి ఎగబడ్డ వాహనదారులు

Money rains on highway in Chile. Here's what happened

Chile: దొంగతనం చేసి డబ్బుతో చెక్కేస్తుండగా.. పోలీసులు వెంట పడటం, ఆ క్రమంలో రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒకానొక ప్రాంతంలో వాహనంలో ఉన్న డబ్బు చెల్లాచెదురై రోడ్డుపై వర్షంలా పడిపోవడం.. ఈ సీన్ ఏదో సందర్భంలో సినిమాలో చూసే ఉంటాం. అలాంటి సీన్ వచ్చినప్పుడు బహుశా మనకు కూడా అలా జరిగి ఉంటే బాగుండనే భావన కలిగి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలో అలాంటి సందర్భాలు ఎప్పుడో కానీ జరగవు.

ఈ విషయంలో చీలిలోని కొద్ది మంది అదృష్టవంతులు. ఎందుకంటే, వారికి తాజా అచ్చం ఇలాంటి ఘటనే ఎదురైంది. ఓ హైవేపై ప్రయాణిస్తున్నవారికి ఎదురైన అనుభవం ఇది. ఓ కారు నుంచి కరెన్సీ నోట్లు జలజల పారే జలపాతంలా పడుతూ ఉంటే, ఆ మార్గంలో వెళ్తున్నవారు వాటిని చకచకా ఏరుకున్నారు. గ్యాంబ్లింగ్ హాల్‌లో దొంగతనం చేసి, పారిపోతున్న దొంగలను పోలీసులు వెంటాడుతుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిలీలోని శాంటియాగో, పుడహెయెల్‌లో ఓ కేసినో ఉంది. అక్కడ బడా బాబులు పెద్ద ఎత్తున జల్సా చేస్తూ ఉంటారు.

కొందరు దొంగలు శుక్రవారం సాయంత్రం ఆ కేసినోలోకి ప్రవేశించి, అక్కడున్నవారిని తుపాకీతో బెదిరించి, భారీగా సొమ్మును చేజిక్కించుకుని, తమ కారులో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగలను వెంటాడారు. ఆ దొంగలు చిలీలోని నార్త్ కోస్టల్ హైవేపైకి పోగలిగారు. విపరీతమైన వేగంతో కారును నడిపారు. అయినా పోలీసులు వారిని వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నారు. దీంతో ఆ దొంగలు పోలీసుల దృష్టిని మళ్లించడం కోసం తమ వద్దనున్న డబ్బు కట్టలను రోడ్డుపైన పడేశారు.

వారి పన్నాగాలకు పోలీసులు లొంగలేదు. చివరికి ఆ కారును ఆపి, ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దొంగలంతా విదేశీయులే. వీరిలో ఇద్దరు చట్టవిరుద్ధంగా చిలీలో ఉంటున్నారు. వీరంతా ఏ దేశానికి చెందినవారో పోలీసులు వెల్లడించలేదు. కొందరు అదృష్టవంతులకు కొన్ని కరెన్సీ నోట్లు దొరకగా, మిగిలిన సొమ్మును ఆ దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

Apple Watch : 12ఏళ్ల బాలిక లైఫ్ సేవ్ చేసిన ఆపిల్ వాచ్.. హై హార్ట్ రేట్ అలర్ట్ చేసింది.. బాలికకు క్యాన్సర్ ఉందని తేలింది..!