So funny video : మ్యాజిక్ ట్రిక్‌ను చూసిన కోతి చేసిన హంగామా మామూలుగా లేదుగా

ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ ట్రిక్‌ను చూసిన కోతి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. మ్యాజిక్ చూసిన ఆ కోతి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేం.

So funny video : మ్యాజిక్ ట్రిక్‌ను చూసిన కోతి చేసిన హంగామా మామూలుగా లేదుగా

Monkey Shocked After Watching Magic Trick

Monkey shocked after watching magic trick : మ్యాజిక్. పిల్లలనే కాదు పెద్దవారిని కూడా అలరిస్తుంది. కన్నుమూసి తెరిచేంతలో చేసే మ్యాజిక్ ట్రిక్ చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. అటువంటి మ్యాజిక్ షోలకు మంచి ఆదరణ ఉంటుంది ఎప్పటికప్పుడు. మ్యాజిక్ లోఉన్న ఆ మ్యాజిక్ మజానే వేరు.అందుకే మ్యాజిక్ అంటే అంత ఇష్టపడతాం. అలా మ్యాజిక్ మనుషులనే కాదు ఓ కోతిని తన మ్యాజిక్ ట్రిక్ తో ఫిదా చేసేశాడో ఓ వ్యక్తి.

అతను చేసిన మ్యాజిక్ చూసిన ఆ కోతి రియాక్షన్ మామూలుగా లేదు. ఒకటే హంగామా చేసేసింది. ఆ వ్యక్తి చేసిన మ్యాజిక్ ట్రిక్ చూసిన ఆ కోతి చేసిన హంగామా..ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాజిక్ ట్రిక్‌ను చూసి చేసిన చేష్ట‌లు చూస్తే మాత్రం న‌వ్వు ఆపుకోలేరు.

కోతుల చిలిపి చేష్ట‌లు చూస్తేనే ముచ్చటేస్తుంది. అటువంటిది మ్యాజిక్ ట్రిక్ చూసిన ఈ కోతి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. పైగా ఈ ట్రిక్ చూసాక ఆ కోతి ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆగదు. అటూ ఇటూ దూకుతో ఆ వ్యక్తి మొహంలోకి చూస్తూ..‘‘వామ్మో ఏందయ్యా ఇది నేనెక్కడా సూడలే’’అన్నట్లుగా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే తెగ నవ్వు వచ్చేస్తుంది.

ఈ విచిత్ర ఘ‌ట‌న చోటు మెక్సికోలోని ఓ జూలో చోటచేసుకుంది. జూకు వెళ్లిన ఓ ఓ సందర్శకుడు ఓ కోతి ముందు ఒక మ్యాజిక్ ట్రిక్ చేశాడు. ఆ మ్యాజిక్ ట్రిక్ చూసి కోతి షాక్ అయింది. పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తించింది. అటూ ఇటూ గెంతుతు నానా హంగామా చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.