Monkeypox to pet dogs: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల నుంచి కుక్కకు సోకిన మంకీపాక్స్

ప్రపంచాన్ని భయపెడుతోన్న మంకీపాక్స్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లాన్సెట్ జర్నల్ లో ప్రచురించారు. మంకీపాక్స్ సోకిన వారు పెంపుడు జంతువులకూ దూరంగా ఉండాలని చెప్పారు. ఫ్రాన్స్ లో ఓ దంపతులకు మంకీపాక్స్ సోకింది. ప్రతిరోజు వారు నిద్రిస్తున్న బెడ్ పైనే వారి పెంపుడు కుక్క పడుకునేది.

Monkeypox to pet dogs: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల నుంచి కుక్కకు సోకిన మంకీపాక్స్

Monkeypox to pet dogs

Monkeypox to pet dogs: ప్రపంచాన్ని భయపెడుతోన్న మంకీపాక్స్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లాన్సెట్ జర్నల్ లో ప్రచురించారు. మంకీపాక్స్ సోకిన వారు పెంపుడు జంతువులకూ దూరంగా ఉండాలని చెప్పారు. ఫ్రాన్స్ లో ఓ దంపతులకు మంకీపాక్స్ సోకింది. ప్రతిరోజు వారు నిద్రిస్తున్న బెడ్ పైనే వారి పెంపుడు కుక్క పడుకునేది.

ఆ కుక్క అనారోగ్య పాలవడంతో వైద్య పరీక్షలు చేయించగా మంకీపాక్స్ అని తేలింది. పెంపుడు జంతువులకు మనుషుల నుంచి సోకిన మొట్టమొదటి మంకీపాక్స్ కేసు ఇదే. ఇంతకు ముందు ఎలుకలు, అడవి మృగాల్లో నిర్ధారణ అయింది. మంకీపాక్స్ సోకితే పెంపుడు జంతువులకు 21 రోజుల పాటు దూరంగా ఉండాలని అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) సూచించింది.

ఇప్పటికే మంకీపాక్స్ కేసులు అనేక దేశాల్లో వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ ను నియంత్రించేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. మంకీపాక్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయి.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ