కోతుల్లో COVID-19 అవే తగ్గించుకుంటాయ్!

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 03:32 AM IST
కోతుల్లో COVID-19 అవే తగ్గించుకుంటాయ్!

కోతులపై జరిపిన రెండు పరిశోధనల్లో అద్భుతమైన విషయాలు వెలువడ్డాయి. COVID-19 ఇన్ఫెక్షన్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇమ్యునిటీని సెల్ఫ్‌గా డెవలప్ చేసుకుంటాయని తెలిసింది. వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ప్రక్రియలో భాగంగా జరిపిన రీసెర్చ్ సక్సెస్ అయిందని చెప్తున్నారు యూఎస్ రీసెర్చర్లు. న్యూ కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు యాంటీబాడీస్ ఉత్పత్తి చేసుకుంటాయని సైంటిఫిక్ గా తేలింది. 

ఓ స్టడీలో భాగంగా రీసెర్చర్లు 9కోతులకు ఇన్ఫెక్షన్ అంటించారు. కరోనా వైరస్ నుంచి అవి తమంతట తామే కోలుకున్నాయి. రికవరీ అయిన తర్వాత మరోసారి వైరస్ ఎక్కించినప్పటికీ అవి జబ్బు పడలేదు. ‘నేచురల్ గా ఇమ్యునిటీని పెంచుకుని రీ ఎక్స్‌పోజర్ నుంచి తమను తాము కాపాడుకుంటాయని బోస్టన్ లోని సెంటర్ ఫర్ వైరాలజీ అండ్ వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన రీసెర్చర్ డా. డాన్ బారౌచ్ అన్నారు. 

రీసెర్చ్ టీంలు పేపర్లను రిలీజ్ చేసినప్పటికీ వాటిలో చాలా వాటిపై రివ్యూలు జరగలేదు. రెండో స్టడీలో బారౌచ్, కొలీగ్స్ కలిసి 25కోతులను 6 ప్రొటోటైప్ వ్యాక్సిన్లతో టెస్టులు చేశారు. మరో సారి యాంటీబాడీలు ఉత్పత్తి చేసుకోగలవా అనే పరీక్ష చేశారు. ఆ స్టడీలో కోతులతో పాటు 10 జంతువులు SARS-CoV2నుంచి కోలుకోగలవని తేలింది. మనుషులు ఇమ్యునిటీ పవర్ డెవలప్ చేసుకున్న దానికంటే కోతుల వేగంగా రికవరీ చేసుకుంటున్నాయి. ఈ డేటా సైంటిఫిక్ అడ్వాన్స్ కు వెల్‌కమ్ చెప్పినట్లని బారౌచ్ అంటున్నారు.(చైనా నుంచి తైవాన్ విడిపోవడాన్ని ఒప్పుకోం: బీజింగ్)