రెండోసారి జాక్ పాట్ కొట్టాడు.. 4 మిలియన్ డాలర్ల లాటరీ గెలిచాడు! 

  • Published By: srihari ,Published On : June 23, 2020 / 12:03 PM IST
రెండోసారి జాక్ పాట్ కొట్టాడు.. 4 మిలియన్ డాలర్ల లాటరీ గెలిచాడు! 

గత 3 ఏళ్లలో మరోసారి 4 మిలియన్ డాలర్లు లాటరీని గెలుచుకున్నాడో మిచిగాన్ వ్యక్తి. మిచిగాన్ లాటరీ ఇన్ స్టంట్ ఆటలో అతడికి రెండవసారి అదృష్టం వరించింది. లాటరీలో ఆ వ్యక్తి 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు అధికారులు తెలిపారు. 

మిచిగాన్‌లో సౌత్ రాక్ వుడ్‌కు చెందిన మార్క్ క్లార్క్ మాట్లాడుతూ.. ఈ లాటరీ టికెట్‌ను కార్లెటన్‌లోని యాష్ మార్కెట్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. టికెట్‌ను ఓ ప్రత్యేక నాణెంతో స్క్రాచ్ చేశాను అని అన్నాడు. లక్షలాది మందిలో తాను రెండవ సారి 4 మిలియన్ డాలర్లు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. 

‘రెండవ సారి లాటరీ గెలిచిన అనుభూతిని వర్ణించటానికి మాటలు రావటంలేదు. మా నాన్నగారు 10 ఏళ్ల క్రితం ఇచ్చిన నాణెం నాకు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. ఆ నాణెం నేను గెలవటానికి ఎంతో సహాయపడిందని అనుకుంటున్నాను’ అని తెలిపాడు. క్లార్క్ 2017లో జాక్ పాట్ కొట్టిన తరువాత ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను.

ఆ తర్వాత మా నాన్న గారితో కలిసి చేపలు పట్టడాన్నికి వెళ్లేవాడని. ఆ జ్ఞాపకాలను మరచిపోలేనివి. మళ్లీ 3 ఏళ్ల తర్వాత 4 మిలియన్ డాలర్లు గెలిచాను. కానీ తాను గెలుచుకున్న 4 మిలియన్ డాలర్లు (రూ.30,33,02,000) బదులుగా 2.5 మిలియన్ డాలర్లును తీసుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. నేను నా జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాను, కానీ ప్రస్తుతం అంతా బాగుందని క్లార్క్ చెప్పుకొచ్చాడు.