Man Moon Landing : ప్రపంచ చరిత్రలో ప్రత్యేక రోజు.. చంద్రుడిపైకి మానవుడు కాలుపెట్టి 52ఏళ్లు

జూలై 20.. ప్రపంచ చరిత్రలో ఓ ప్రత్యేక రోజు. ఎందుకంటే.. మానవుడు తొలిసారిగా చంద్రునిపై కాలు మోపింది ఈ రోజే. సరిగ్గా 52ఏళ్ల కిందట

Man Moon Landing : ప్రపంచ చరిత్రలో ప్రత్యేక రోజు.. చంద్రుడిపైకి మానవుడు కాలుపెట్టి 52ఏళ్లు

Man Moon Landing

Man Moon Landing : జూలై 20.. ప్రపంచ చరిత్రలో ఓ ప్రత్యేక రోజు. ఎందుకంటే.. మానవుడు తొలిసారిగా చంద్రునిపై కాలు మోపింది ఈ రోజే. సరిగ్గా 52ఏళ్ల కిందట అమెరికాకు చెందిన అస్ట్రోనాట్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. అపోలో 11 వ్యోమనౌక ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. కొన్ని గంటల తర్వాత.. అంటే 21.56 సీటీ (సెంట్రల్ టైమ్) (భారత కాలమానం ప్రకారం జూలై 21 ఉదయం 9.26 గంటలకు) నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి, మానవ చరిత్రలో చంద్రుడిపై నడిచిన మొదటి మనిషిగా నిలిచిపోయారు.

అపోలో 11 స్పేస్ ఫ్లైట్ కమాండర్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. లూనార్ మాడ్యుల్ పైలట్లు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ ను తీసుకెళ్లింది. ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్ అల్డ్రిన్‌ అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు భూమి సహజ ఉపగ్రహానికి వెళ్లి వచ్చారు. స్పేస్ క్రాఫ్ట్ వెలుపల ఆర్మ్ స్ట్రాంగ్ సుమారు రెండున్నర గంటల పాటు గడిపారు. ఈ ఇద్దరు అస్ట్రోనాట్ లు 21.5 కేజీల లూనార్ మెటీరియల్ సేకరించారు.

లూనార్ స్పేస్ పై సుమారు 21గంటలు గడిపారు. ఆ సైట్ కి ట్రాన్ క్విలిటీ బేస్ అని పేరు పెట్టారు. కమాండ్ మాడ్యుల్ కొలంబియాలో అస్ట్రోనాట్ తో కలిసి జూలై 24న తిరిగి భూమికి వచ్చేశారు. అమెరికా అప్పటి అధ్యక్షుడు రిచ్చర్డ్ నిక్సన్ జూలై 20ని నేషనల్ మూన్ డే గా 1971లో అనౌన్స్ చేశారు.

జూలై 20 అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక రోజుగా మారింది. సరికొత్త అన్వేషణలకు కారణమైంది. అపోలో 11 మిషన్ సక్సెస్ కావడంతో మరిన్ని మిషన్లు చేపట్టేందుకు నాసాకు మార్గం సుగమం అయ్యింది.