కరోనా వైరస్ ఎఫెక్ట్ : షిప్ లో చిక్కుకున్న 6వేల మంది ప్రయాణికులు

కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 03:48 PM IST
కరోనా వైరస్ ఎఫెక్ట్ : షిప్ లో చిక్కుకున్న 6వేల మంది ప్రయాణికులు

కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా

కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా కరోనా వైరస్ భయం 6వేల మంది ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. 6వేల మంది ప్రయాణికులు  ship లో చిక్కుకుపోయారు. ఇటలీలోని రోమ్ లో ఈ ఘటన జరిగింది. కోస్టా క్రూయిజ్ ఆధ్వర్యంలో షిప్ నడుపుతున్నారు. ఆ షిప్ లో 6వేల మంది ఉన్నారు. వారిలో చైనాలోని(china) మకావ్(macau) కు చెందిన 54 మహిళలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆమె పాటు ప్రయాణించిన మిగతా వారికి కూడా వైరస్ ఏమన్నా సోకిందా అనే అనుమానాలతో అధికారులు.. ప్రయాణికులను షిప్ నుంచి కిందకు దిగనివ్వలేదు. వారందరిని పడవలోనే నిర్బంధించారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇది దారుణం, అమానుషం అని వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కోస్టా క్రూయిజ్ ఆధ్వర్యంలో షిప్ నడుపుతున్నారు. వారం రోజుల ట్రిప్ ఉంటుంది. ఈ షిప్ కెపాసిటీ 8వేలు. వీరిలో 6వేల 554 మంది గెస్టులు  కాగా, 1,678 క్రూ సిబ్బంది. శుక్రవారం(జనవరి 31,2020) రోజున ట్రిప్ ముగియాల్సి ఉంది. కాగా, కరోనా వైరస్ కారణంగా షిప్ ని మధ్యలోనే ఆపేశారు. ప్రయాణికులను అందులోనే నిర్భందించారు. అందరికీ టెస్టులు చేశాకే వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో షిప్ లో ఉన్న ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్ మెంట్ లేదు, మెడిసిన్ లేదు. వైరస్ సోకితే ప్రాణం పోవాల్సిందే. అందుకే కరోనా పేరు వింటే చాలు..పై ప్రాణాలు పైనే పోతున్నాయి.

చైనాలోని వూహన్(wuhan)లో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాలో ఇప్పటికే 170మంది చనిపోయారు. 8వేల coronavirus కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనాకు వెళ్లాలంటే విదేశీయులు వణికిపోతున్నారు. దీంతో వ్యాపార పరంగా, పర్యాటక పరంగా, వాణిజ్య పరంగా చైనాపై ఎఫెక్ట్ బాగా పడింది.