Google Search : గూగుల్‌లో ఆమె కోసం అత్యధిక మంది సెర్చ్ చేశారు.. ఎందుకో తెలుసా?
గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సెలబ్రిటీల జాబిబాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ సెలెబ్‌టాట్లర్ విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం అమెరికన్ నటి అంబర్ హార్డ్ టాప్ ప్లేస్‌లో ఉంది. రెండో స్థానంలో హార్డ్ మాజీ భర్త, హాలీవుడ్ నటుడు జానీడెప్ ఉన్నారు.

Amber Heard
Google Search : ఏదైనా విషయం గురించి గానీ, వస్తువు గురించి గానీ, వ్యక్తి గురించి గానీ.. తెలుసుకోవాలనుకుంటే వెంటనే గూగుల్ లో వెతుకుతాం. గూగుల్ వెబ్‌సైట్ అనేక విషయాలను ఏర్చి కూర్చి అందిస్తోంది. అయితే, గూగుల్‌లో అత్యధిక మంది దేని కోసం వెతుకుతారు? అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఏడాదిలో గూగుల్ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది నెటిజన్లు వెతికింది దేని కోసమంటే.. అనే విషయాలను సిమిలర్‌వెబ్ బ్లాగ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన టాప్ 100 కీవర్డ్స్ జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో తొలిస్థానం యూట్యూబ్‌ది కాగా.. తర్వాతి స్థానాల్లో ఫేస్‌బుక్, ట్రాన్స్‌లేట్, పోర్న్‌హబ్, వెదర్, అమేజాన్, గూగుల్ ట్రాన్స్‌లేట్ జీమెయిల్, వాట్సాప్ వెబ్, ట్రాడక్టర్ చోటు సంపాదించాయి. అలాగే గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సెలబ్రిటీల జాబిబాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ సెలెబ్‌టాట్లర్ విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం అమెరికన్ నటి అంబర్ హార్డ్ టాప్ ప్లేస్‌లో ఉంది.
Google Search Results: గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌ను ఇలా కనుగొంటుందట
రెండో స్థానంలో హార్డ్ మాజీ భర్త, హాలీవుడ్ నటుడు జానీడెప్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో క్వీన్ ఎలిజబెత్-II, టామ్ బ్రాడీ, కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ ఉన్నారు. ఎలాన్ మస్క్ ఏడో స్థానంలో నిలువగా.. విల్‌స్మిత్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. అయితే, ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.