బైడెన్‌కు భద్రతగా వచ్చిన 150మందికిపైగా నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్

బైడెన్‌కు భద్రతగా వచ్చిన 150మందికిపైగా నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్

More than 150 National Guard test positive for coronavirus : వాషింగ్టన్ డీసీలో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాస్వీకారోత్సవానికి భద్రత కల్పించేందుకు వచ్చిన 200మంది నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ కాపిటల్‌పై జనవరి 6న దాడికి పాల్పడిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నగరంలో కఠినమైన భద్రతా చర్యలను విధించిన సంగతి తెలిసిందే.

రేజర్ వైర్‌తో కంచెలు ఏర్పాటు చేసి నేషనల్ గార్డ్ చెక్ పాయింట్లలో భారీగా మోహరించారు. అయితే, బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి భద్రతగా వచ్చిన నేషనల్ గార్డ దళాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 25 వేల మందికి పైగా భద్రతా దళాలు సిటీలో మోహరించారు. ప్రజారోగ్య డేటా ప్రకారం.. అమెరికాలో వరుసగా రెండవ రోజు 4,000 కన్నా ఎక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయి.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 410,000కు చేరింది. సిబ్బంది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వేలాది మంది సైనికులు స్వదేశానికి తిరిగి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

రాబోయే ఐదు నుంచి 10 రోజుల్లో 15 వేల మంది నేషనల్ గార్డులు వాషింగ్టన్ నుంచి బయలుదేరే అవకాశం ఉందని మిలటరీ వెల్లడించింది. సుమారు 7,000 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది ఈ నెలాఖరులోగా ఉండాలని భావిస్తున్నారు. మార్చి మధ్యలో సుమారు 5,000 మంది భద్రతా బలగాలు ఉంటారని భావిస్తున్నారు.