America : అమెరికాలో కరోనా కల్లోలం…ప్రతిరోజూ లక్షల్లో కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలు

అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

America : అమెరికాలో కరోనా కల్లోలం…ప్రతిరోజూ లక్షల్లో కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలు

America

corona deaths in America : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అమెరికాను కరోనా వణికిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం పెరిగిపోతోంది.

వైరస్ బారిన పడి ప్రతి రోజూ రెండు వేలకు పైగా మృతి చెందుతున్నారు. కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మృతి చెందినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. గత వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతి చెందినట్లు పేర్కొంది.

Mu Covid Variant : ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం, తొలి కేసు నమోదు, 40 దేశాలకు వ్యాప్తి

కరోనా మృతుల సంఖ్య ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతోంది. సెప్టెంబర్‌ 13న అమెరికాలో 2.85 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం తగ్గుతూ వచ్చాయి. గత శుక్రవారం 1.65 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం 2వేలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం.

డెల్టా వేరియంట్‌ కారణంగానే భారీ స్థాయిలో ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని పేర్కొంది. అమెరికాలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా 63 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.