Home » International » ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ వండింది
Updated On - 2:52 pm, Wed, 10 February 21
Moroccan Woman Murdered Lover: యూఏఈలో భయానక ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడిని అతి దారుణంగా చంపింది. అంతేకాదు, అతడి శరీర భాగాలతో(అంగం, వృషణాలు) బిర్యానీ వండింది. ఆ బిర్యానీని ఇంటి పక్కన భవన నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు ఆహారంగా పెట్టింది.
ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30ఏళ్ల మహిళ యూఏఈలో నివాసం ఉంటోంది. గత ఏడేళ్లుగా ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, అతడు మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమెకు తెలిసింది. దీంతో ఆమె ప్రియుడితో గొడవపడింది. ఈ గొడవలో ఆమె ప్రియుడిని చంపేసింది.
అతడి మృతదేహాన్ని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిర్ణయించిన ఆమె దారుణానికి ఒడిగట్టింది. అతడి అంగం, వృషణాలు కోసి అరబిక్ సాంప్రదాయక ఆహారమైన మక్బూస్ (బిర్యానీ తరహాలో బియ్యం, మాంసంతో వండుతారు) తయారు చేసింది. తన ఇంటి పక్కనే భవన నిర్మాణ పనులు చేపడుతున్న పాకిస్తానీ కూలీలకు ఆ ఆహారాన్ని వడ్డించింది. విషయం తెలియక కూలీలు వాటిని మాంసం ముక్కలు అనుకుని తినేశారు. ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా చేసి కుక్కలకు ఆహారంగా పెట్టింది ఆ మహిళ.
అయితే, కొద్ది రోజులుగా ఆ వ్యక్తి ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా కలవకపోడంతో.. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఇంటిని సోదా చేయగా షాక్ కి గురయ్యారు. మిక్సిలో దంతాలు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన దారుణం తెలుసుకుని పోలీసులు కూడా విస్తుపోయారు. ఆమె మానసిక స్థితి తెలుసుకోవడానికి ఆసుపత్రికి తరలించారు.
పెందుర్తిలో ఆరుగురి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్టులు.. అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడమే కారణమా?
Husband Murder Wife Sucide : భర్త హత్య..గర్భంతో ఉన్న భార్య ఆత్మహత్య..
వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు
Jharkhand : తండ్రికి కరోనా పాజిటివ్, రక్షించాలంటూ కూతురు వేడుకోలు..పట్టించుకోని డాక్టర్లు..చివరకు
Selfie: సెల్ఫీ మోజులో.. ప్రేమజంట మృతి
Suresh Raina Amabati Rayudu : వంట మాస్టర్లుగా మారిన ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు.. ఏం వండారో చూడండి..