న్యూ ఇయర్… రష్యాలో కృత్రిమ మంచు

రష్యా రాజధాని మాస్కోలోని అధికారులు నూతన సంవత్సరం గిఫ్ట్ గా చల్లని వాతావరణం కోసం కృత్రిమ మంచును తయారు చేసి రోడ్లపై మంచు వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలు విషయమేంటంటే.. 1886 నుంచి మాస్కోలో చలికాలంలో కూడా వేడి వాతావరణం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో తీవ్రస్థాయిలో వేడి వాతావరణం నెలకొంది. 1886 తర్వాత 2019 డిసెంబర్ లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు రష్యా హైడ్రోమెటియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఈ రీసెర్చ్ ద్వారా రష్యాలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
దీంతో రాజధాని మధ్యలో ప్రధాన రహదారి అయిన ట్వెర్స్ కాయ, రెడ్ స్క్వేర్, ఇతర ప్రాంతాల్లో కృత్రిమ మంచు కొండలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిటీ హాల్ సీనియర్ అధికారి అలెక్సీ నెమెరిక్ తెలిపారు .వాతావరణంలో వచ్చే మార్పులకు దేశానికి నష్టం వాట్లిలుతుందని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు.
На Тверскую улицу завезли снег и перекрыли её для автомобилей.
Улицы Тверская, Моховая, Охотный ряд и Театральный проезд будут пешеходными до 22:00 6 января.
С московским бюджетом можно все купить. Даже зиму pic.twitter.com/lGxEBizRzT
— Дикая Москва (@WildWildMoscow) December 28, 2019
Moscow is experiencing its warmest winter since 1886. Fake snow needed for new year’s celebration. Get used to this. pic.twitter.com/kn9M2xrhPw
— The Real Chuck Stoops (@StoopsThe) December 29, 2019