Face Pay : అందుబాటులోకి “ఫేస్ పే”..మెట్రోలో ఎక్కాలంటే కార్డులు,ఫోన్ పే అక్కర్లేదు

సాధారణంగా రైలు, బస్సు, మెట్రో రైలు, విమానాల్లో ప్రయాణాలు చేయడానికి ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటాం లేదా అప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో టిక్కెట్లను కొనుక్కుంటాం. కొన్ని మెట్రోలు

Face Pay : అందుబాటులోకి “ఫేస్ పే”..మెట్రోలో ఎక్కాలంటే కార్డులు,ఫోన్ పే అక్కర్లేదు

Face Pay

Face Pay సాధారణంగా రైలు, బస్సు, మెట్రో రైలు, విమానాల్లో ప్రయాణాలు చేయడానికి ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటాం లేదా అప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో టిక్కెట్లను కొనుక్కుంటాం. కొన్ని మెట్రోలు అయితే ప్రయాణం చేయడానికి నెలవారీ కార్డులు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి. మెట్రో స్టేషన్లోకి ప్రవేశించే ముందే కార్డును ఉపయోగించడం ద్వారా ప్రయాణం చేసే వెలుసుబాటు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా రాజధాని మాస్కో మెట్రోలో ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపులు చేసే వెలుసుబాటు కల్పించారు.

నగదు రహిత,కార్డు రహిత,ఫోన్ రహిత సిస్టమ్- “ఫేస్ పే”ను  మాస్కో మెట్రోలో అందుబాటులోకి వచ్చింది. 240 స్టేషన్లలో ఫేషియల్ ఐడీ ద్వారా చెల్లింపులు చేసే ఈ వ్యవస్థను శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా లేదని మాస్కో రవాణా వ్యవస్థ అధిపతి మాగ్జిమ్ లిస్క్సుటోవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఫేస్ పే ఉపయోగించుకోవాలనుకునే ప్రయాణీకులు ముందుగా వారి ముఖ చిత్రాన్ని ఇవ్వాలి. బ్యాంకు కార్డులను మాస్కో మెట్రో యాప్ ద్వారా అనుసంధానం చేసుకోవాలి. ఇలా అనుసంధానం చేసుకున్న వారు ఫేస్ పే ద్వారా మెట్రో స్టేషన్ లో ప్రత్యేక టర్నస్టైల్ వద్ద కెమెరాను ఒక్కసారి చూసి మెట్రోలో ఎక్కవచ్చు.

మాస్కోలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కొన్నాళ్ల క్రితం వీడియో నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్ 19 సమయంలో జనం విచ్చలవిడిగా తిరగకుండా నియంత్రించడం, అలాంటి వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించడం, రాజకీయ ర్యాలీలకు హాజరైన నిరసన కారులను గుర్తించడం, వారిని అరెస్టు చేసేందుకు కూడా ఈ వీడియో నిఘా వ్యవస్థ ఉపయోగపడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఇదే వ్యవస్థను ఫేస్ పే చేసేందుకు పోలీసులు అనుమతించారు.

అయితే ఈ వ్యవస్థ ప్రజల గోప్యతను, మానవ హక్కులను దెబ్బతీసేదిగా ఉందని డిజిటల్ హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2018లో మాస్కోలో సాకర్ వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు నేరస్థులను గుర్తించడానికి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు మాస్కో మేయర్ కార్యాలయం తెలిపింది. అయితే ఈ ఫేస్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రయాణీకుల డేటా సురక్షితంగా ఉంటుందని మాస్కో మెట్రో అధికారులు చెబుతున్నారు.

ALSO READ 25వ ఫ్లోర్ నుంచి జారిపడి కవలలు మృతి