Expensive Houseplant : సరికొత్త రికార్డ్.. కేవలం 8 ఆకులు ఉండే ఈ ఇంటి మొక్క ఖరీదు రూ.14లక్షలు
ఓ అరుదైన ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోయింది. న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మీ వేదికగా కేవలం 8 ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను ఆక్లాండ్ వాసి ఏకంగా రూ.14లక్షలకు సొంతం చేసుకున్నాడు.

Most Expensive Houseplant
Most Expensive Houseplant : ఓ అరుదైన ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోయింది. న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మీ వేదికగా కేవలం 8 ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను ఆక్లాండ్ వాసి ఏకంగా రూ.14లక్షలకు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే దీని పేరు రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అని ట్రేడ్ మీ తెలిపింది. ఇళ్లల్లో పెంచుకునే మొక్కల్లో అత్యధిక ధర పలికిన అరుదైన మొక్క ఇదేనని ట్రేడ్ మీ వెల్లడింది.
ఈ మొక్క ప్రతి ఆకులో కాండం వలే అద్భుతమైన వైవిధ్యం ఉందని ట్రేడ్ మీ తెలిపింది. రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్‌లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదైన వివరాల ప్రకారం ఈ మొక్క థాయ్‌లాండ్, మలేషియాకు చెందినదని వెల్లడైంది. ఓ ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అది పలికిన ధర తెలిసి అంతా విస్తుపోతున్నారు.