Strange Tradition : కుటుంబంలో ఎవరు చనిపోయినా..ఆ ఇంట్లో మహిళల చేతివేళ్లు కోసివేసే భయంకర ఆచారం..

ప్రపంచ వ్యాప్తంగా జీవించే ఎన్నో కులాలు...తెగల్లో కొన్ని ఆచారాల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది..రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి విచిత్రమైన భయంకరమైన ఆచారాల్లో ఒకటి కుటుంబంలో ఎవరు చనిపోయినా ఆకుటుంబంలోని స్త్రీ చేతి వేళ్లను కట్ చేసే ఆచారం ఒకటి..అదే కాకుండా మరెన్నో ఆచారాల గురించి తెలుసుకుందాం..

Strange Tradition : కుటుంబంలో ఎవరు చనిపోయినా..ఆ ఇంట్లో మహిళల చేతివేళ్లు కోసివేసే భయంకర ఆచారం..

Strange Tradition in All over the world : ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో..ఎన్నో కులాలు..మరెన్నో తెగలు. తెగలు అంటే మనకు గుర్తుకొచ్చేది గిరిజనులు..ఆదివాసీలు. ఈ ఆధునిక యుగంలో వారు కూడా చదువుకుంటున్నారు..ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వారి సంప్రదాయాలను మాత్రం వదులుకోరు. నేటికీ ఈ ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రపంచంలో తమ పాత సంప్రదాయాలలో జీవించే వ్యక్తులు ఉన్నారు. వారి జీవన విధానం , సంప్రదాయాలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. కొన్ని అయితే అత్యంత ప్రమాదకరమైనవిగా కూడా ఉంటాయి. అటువంటి కొన్ని ఆచారాల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది..

Finger Cutting Tradition In Papua - यहां एक 'खास वजह' से महिलाओं की उंगलियां काट दी जाती हैं - Amar Ujala Hindi News LiveExpedition to Papua and Raja Ampat 2021. Tour to Papua and Raja Ampat with MZUNGU EXPEDITIONS

ఇండోనేషియాలోని డాని తెగలో వేళ్లు కత్తిరించే పద్ధతి ఈనాటికి కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబంలోని స్త్రీలు తమ వేలిలో కొంత భాగాన్ని కోసేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆచారం నిషేధించబడినా..కొంతమంది వృద్ధులు ఇప్పటికీ ఈ సంప్రదాయాలను పాటిస్తున్నారు.

 ,[object Object],చైనాలో ఓ ప్రాంతంలో భర్త తన గర్భిణీ భార్యతో కాలుతున్న బొగ్గుపై చెప్పులు లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల డెలివరీ సులభంగా జరుగుతుందని నమ్ముతారు.

చైనాలో చదువుకున్న వారు కూడా వారి వారి సంప్రదాయాలను ఏమాత్రం వదులుకోరు. అలా చైనాలోని ఓ ప్రాంతంలో భర్త తన గర్భం ధరిస్తే..భార్య భుజాల మీద మోస్తూ..భగభగా మండుతున్న నిప్పులపై చెప్పులు లేకుండా నడవాలి. ఇలా చేయడం గర్భిణికి డెలివరీ సులభంగా జరుగుతుందని నమ్ముతారు.

 దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియాలో, మసాకి అనే అడవి తెగ ప్రజలు వివిధ శుభ సందర్భాలలో ఆవు రక్తాన్ని తాగుతారు. ఇది పిల్లల పుట్టుక, వివాహ సమయంలో కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తులు మొదట ఆవును బాణంతో గాయపరిచి, ఆపై దానిని పీల్చి దాని రక్తాన్ని తాగుతారు. ఈ సమయంలో ఆవు చనిపోకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఆఫ్రికా దేశాల్లో సంప్రదాయాలు చాలా భయంకరంగా ఉంటాయి. దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియాలో..మసాకి అనే అడవి తెగ ప్రజలు శుభకార్యాల్లో ఆవు రక్తాన్ని తాగుతారు. ముఖ్యంగా ఇటువంటి సంప్రదాయం వివాహ సమయాల్లోను..ఏ ఇంటిలోనైనా ప్రసవం జరిగినా ఆవు రక్తం తాగుతారు. ఆవును బాణంతో గాయపరిచి..తరువాత దానిని పీల్చి దాని రక్తాన్ని తాగుతారు. కానీ ఆవు చనిపోకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

Weird! In this country newly-wed couples not allowed to use toilets for three days and nights for this strange reason | Catch News

మలేషియా, ఇండోనేషియాలోని టిడాంగ్ తెగలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. కొత్త జంట మూడు రోజుల పాటు బాత్రూమ్‌ను ఉపయోగించకూడదు.కనీసం మూత్ర విసర్జనకు లేదా మల విసర్జనకు వెళ్లకూడదు. కనీసం స్నానం కూడా చేయకూడదు.ఇలా చేస్తే వైవాహిక జీవితంలో సుఖశాంతులుగా ఉంటుందని నమ్ముతారు.

The Love Huts of Cambodia's Kreung Tribe - Introduction - Louis Quail PhotographyCambodian Fathers Build Love Huts For Teenage Daughters SEX | Reckon Talk

కంబోడియాలో తండ్రులు తమ కుమార్తెల కోసం ఎక్కడా ఊహించని సంప్రదాయం పాటిస్తారు. ఆడపిల్లలకు పీరియడ్స్ ప్రారంభమైన వెంటనే అంటే 13 నుంచి 15 ఏళ్లలోపు వారికి ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు. వాటిని లవ్ హట్ అంటారు. ఆ అమ్మాయి తన భర్తను సెలక్ట్ చేసుకోవటానికి నచ్చిన అబ్బాయిలతో శారీక సంబంధాలు పెట్టుకోవాలని ప్రోత్సహిస్తారు. అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయి దొరికే వరకు అబ్బాయితో సంబంధం పెట్టుకోవచ్చు.

చైనాలోని ఓ ప్రాంతంలో ఓ వింత ఆచారం వుంది. పెళ్లికి నెలరోజుల ముందు నుంచి ఆ పెళ్ళికూతురు రోజుకు ఒక గంట చొప్పున ఏడవాలి. 10 రోజుల తర్వాత ఆమెకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఆ ఏడుపులో పాలుపంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ళ అమ్మమ్మ తోడవుతుంది. నెల రోజుల్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా పెళ్లికూతురుకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట.

198 Killer Whale Teeth Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

ఫిజీ దేశంలో పెళ్ళికొడుకు పిల్లనిచ్చే మామను పిల్లతో పాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడట. మరి ఆ దంతాన్ని ఇచ్చి పిల్లకు పెళ్లి చేయాలంటే పిల్ల తండ్రి ఆస్తి మొత్తం అమ్మడంతో పాటు దొంగతనాలు చేయక తప్పదు.

స్వీడన్ దేశంలో ఒక వింత ఆచారం వుంది. వివాహ రిసెప్షన్ లో నవదంపతులు కూర్చున్నచోట నుంచి పక్కకు వెళితే చాలు వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట. అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్రూంకి వెళ్లినా సరే అమ్మాయినయితే పురుషులు, అబ్బాయినయితే మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట. ఆఫ్రికా లోని కొన్ని గ్రామాల్లో..పెళ్లయ్యాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా పెళ్లికూతురు తల్లిని కూడా బెడ్ రూమ్ లోకి పంపుతారట. అలాగే మరో ఆఫ్రికా దేశమైన కాంగోలో పెళ్లి ఆచారం వెరైటీగా ఉంటుంది. పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఎన్నో వింత ఆచారాలు..మరెన్నో విచిత్రం సంప్రదాయాలు కొనసాగుతున్నాయి.