వంద మందికిపైగా పిల్లలు కావాలంట..ఇప్పటికే 11 మంది సంతానం

వంద మందికిపైగా పిల్లలు కావాలంట..ఇప్పటికే 11 మంది సంతానం

addicted to having babies : ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారి ఆలనాపాలనా చేసేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు.. అలాంటిది ఏకంగా 100 మంది పిల్లలను కనాలని ఉందంట. తన కుటుంబాన్ని విస్తరించాలని ఉవ్విళ్లూరుతోంది ఓ తల్లి. అందుకు ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. వంద మంది పిల్లల్నికని రికార్డు సృష్టించాలని అనుకొంటోంది. 23 ఏళ్ల క్రిస్టినా ఓజ్టర్క్ మహిళకు గల్లిప్ ఓజ్టర్క్ తో వివాహం జరిగింది. వీరు రష్యాలోని జార్జియాలో నివాసం ఉంటున్నారు. వీరు కోటీశ్వరులు.

గల్లిప్ ను చూడగానే..ప్రేమలో పడిపోయాయని, తనను తొలి చూపులోనే ప్రేమించాడని క్రిస్టినా తెలిపింది. వీరికి అత్యంత విలాసవంతమైన రెస్టారెంట్ వ్యాపారం ఉంది. క్రిస్టినా ఓ బిడ్డకు తల్లయ్యింది. పిల్లలను కనాలనే ఉద్దేశ్యంతో..సరోగేట్ ద్వారా శిశువులను కన్నది. ఇలా 10 మందికి తల్లయ్యింది. ఇప్పుడు..ఆ దంపతులు మరింత మందిని కనాలని అనుకుంటున్నారు. క్రిస్టినాకు పిల్లలంటే ఎంతో ఇష్టమంట. మరింత మంది పిల్లలకు జన్మనివ్వాలని భావిస్తోంది.

వంద మంది పిల్లలకు తల్లి కావాలని అనుకొంటోందని, సరోగేట్ విధానంలో పిల్లలను కనేందుకు..ఒక్కో సరోగేట్ మదర్ కు 8వేల యూరోలు అందిస్తున్నామని గల్లిప్ వెల్లడించారు. సరోగేట్ మదర్ దగ్గర శిశువు కొన్నాళ్లు పెరిగాక, తాము వారిని తెచ్చుకుంటామన్నారు. చెరగని నవ్వుతో ఉండే..క్రిస్టీనా అంటే తనకు ఎంతో ఇష్టమని తన ప్రేమను వ్యక్తపరిచాడు. 1997లో సరోగసిని చట్టంగా మార్చారు.