Russia vs Ukraine war: యుద్ధభూమిలో తెరుచుకున్న సినిమా థియేటర్.. తొలిరోజు హౌస్‌ఫుల్

యుక్రెయిన్‌లో మూడు నెలలుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాసైన్యం.. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వశం చేసుకొనేందుకు ..

Russia vs Ukraine war: యుద్ధభూమిలో తెరుచుకున్న సినిమా థియేటర్.. తొలిరోజు హౌస్‌ఫుల్

Ukrain

Russia vs Ukraine war: యుక్రెయిన్‌లో మూడు నెలలుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాసైన్యం.. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వశం చేసుకొనేందుకు సీవీదొనెట్క్స్ నగరంపై విరుచుకుపడుతుంది. దీంతో అక్కడ యుక్రెయిన్ – రష్యా సేనల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలు రష్యా సైన్యం దాడులకు వణికిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే భీకర యుద్ధం వేళ యుక్రెయిన్‌లోని నగరాలపై రష్యా సైన్యం దాడుల చేసి సర్వనాశనం చేసింది.

Russia ukraine war : ‘యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి’..అమెరికా,పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్

అయితే యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడి చేసినప్పటికీ యుక్రెయిన్ సేనల ప్రతిదాడులతో రష్యాసైన్యం వెనక్కు తగ్గింది. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కీవ్ లో రోజువారి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇదిలో ఉంటే సినిమా థియేటర్లు, నేషనల్ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కీవ్ శివారులోని పొదిల్‌లో ఉన్న ఓ థియేటర్ ప్రదర్శనను మొదలు పెట్టింది. అయితే రష్యా సైన్యం కొనసాగిస్తున్న యుద్ధంతో ప్రజలు థియేటర్‌కు వస్తారో..రారో అని థియేటర్ యాజమాన్యం భావించింది. కానీ థియేటర్‌లో తొలిరోజు మూడు షోలకు సంబంధించి టికెట్లు హౌస్ ఫుల్ కావటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Russia vs Ukraine war: పుతిన్‌కు భారీషాక్.. ఇంటబయట తప్పని కష్టాలు.. అధికారం కాల్పోవటం ఖాయమా?

ఇదిలాఉంటే యుద్ధం సమయంలో ప్రేక్షకులు వస్తారా, వారు థియేటర్ గురించి ఆలోచిస్తారా అని మేము భావించామని, కానీ ఊహించని విధంగా థియేటర్ హౌస్ ఫుల్ అయిందని నటులలో ఒకరైన యూరీ ఫెలిపెంకో పేర్కొన్నాడు. మొదటి మూడు షోలు పూర్తిస్థాయిలో టికెట్లు అమ్ముడవ్వడంతో మేం సంతోషంగా ఉన్నామని అన్నారు. థియేటర్లో కేవలం కొంతమంది నటులతో నాటకాలు ప్రదర్శించడం జరుగుతుందని ఫిలిపెంకో చెప్పారు.