ఎంపీలు పిల్లలకు పాలివ్వొచ్చు

  • Published By: madhu ,Published On : February 2, 2020 / 04:13 AM IST
ఎంపీలు పిల్లలకు పాలివ్వొచ్చు

అవును..ఎంపీలు పిల్లలకు స్వేచ్చగా పాలివ్వొచ్చు. హాస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్స్‌లో ఎంపీలు తల్లిపాలు ఇవ్వడానికి అనుమతినిస్తున్నట్లు హౌస్ స్పీకర్ లిండ్సే హోయల్ ప్రకటించారు. 1992 – 2000 సంవత్సరం వరకు బెట్టి బూథ్రాయిడ్ హౌస్ ఆఫ్ స్పీకర్‌గా పనిచేశారు. అప్పుడు…తల్లి పాలివ్వడాన్ని నిషేధం కొనసాగింది. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్, ఇతర ప్రాంతాల్లో మాత్రమే తల్లి పాలివ్వడాన్ని అనుమతించే వారు.

2019, నవంబర్‌లో స్పీకర్‌గా లిండ్సే బాధ్యతలు స్వీకరించారు. తాజాగా తల్లి పాలివ్వడంపై ఆయన పై విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది తల్లి నిర్ణయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి ఎంపీగా స్టెల్లా క్రిసీ 2019 డిసెంబర్‌లో చరిత్ర సృష్టించారు. 1980లో పార్లమెంట్‌లో పాలిచ్చిన మొట్టమొదటి ఎంపీలలో ఒకరైన హర్మాన్‌ను ఆయన ప్రశంసించారు. 

Read More : సార్..మా అమ్మను రక్షించండి..KTRకు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వేడుకోలు