Home » International » Mrs.srilanka winner : మిసెస్ శ్రీలంకకు స్టేజీపైనే ఘోర అవమానం..విజేత కిరీటాన్ని లాగేసిన మిసెస్ వరల్డ్..
Publish Date - 11:05 pm, Wed, 7 April 21
Insult to Mrs. Sri Lanka Pushpika D’Selva on stage :శ్రీలంకలో నిర్వహించిన మిసెస్ శ్రీలంక పోటీల్లో అనూహ్య పరిణామం జరిగింది. అందాల రాణుల ఎంపిక పోటీలో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వాకు స్టేజీ పైనే ఊహించిన అవమానం జరిగింది. ‘‘మిసెస్ శ్రీలంక’’ పోటీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వా తలపై ఉంచిన కిరీటాన్ని మిసెస్ వరల్డ్ , మాజీ మిసెస్ శ్రీలంక కరోలిన్ జ్యూరీ… స్టేజీపైననే లాగేసారు. దీందో పుష్పికా షాక్ అయ్యింది. ఆ షాక్ నుంచి ఆమె కోలుకునేలోపే కరోలిన్ ‘‘మిసెస్ శ్రీలంక’’కిరీటాన్ని తలపై పెట్టుకునే అర్హత పుష్పికాకు లేదు..పుష్పిక భర్త నుంచి విడాకులు తీసుకుంది మరి ఆమెకు మిసెస్ శ్రీలంక కిరీటాన్ని ధరించే అర్హత ఎలా ఉంటుంది? అంటూ తీవ్ర ఆరోపించింది కరోలిన్.
అందాల పోటీల్లో జరిగిన ఈ ఊహించన పరిణామం గురించి వివరాల్లోకి వెళితే..శ్రీలంక రాజధాని అయిన కొలంబోలోని ఒక థియేటర్‌లో మిసెస్ శ్రీలంక అందాల పోటీని నిర్వహించారు. ఆదివారం జరిగిన అందాల పోటీ కార్యక్రమాన్ని ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ పోటీల్లో శ్రీమతి పుష్పిక డి సిల్వా ‘‘మిసెస్ శ్రీలంక’’ విజేతగా నిలిచారు. దీంతో ఆమె తలపై కిరీటం మాజీ మిసెస్ శ్రీలంక కరోలిన్ జ్యూరీ అలంకరించారు.
ఆ తరువాత ఆమె మాట్లాడుతూ..‘‘ ఈ మిసెస్ శ్రీలంక పోటీల్లో వివాహితలకు మాత్రమే విజేతగా నిలిచే హక్కు ఉంటుంది. విడాకులు తీసుకున్న వారికి కాదు’’ పుష్పిక డి సిల్వా విడాకులు తీసుకున్నారు.. అని ఆరోపించారు. అందుకే ఈ కిరీటాన్ని రెండవ స్థానంలో నిలిచిన మహిళకు ఇవ్వాలని కోరారు. అక్కడితో కరోలిన్ ఊరుకోకుండా..పుష్పిక తలమీదనుంచి కిరీటాన్ని తీసివేసి పక్కనే నిల్చుని ఉన్న మొదటి రన్నరప్‌నకు ఆమే స్వయంగా అలకరించారు. ఈ క్రమంలో సిల్వా జుట్టు మొత్తం చెదిరిపోయింది. కరోలిన్ ప్రవర్తనతో కంగుతిన్న పుష్పికా డి సిల్వా అక్కడి నుంచి అవమానభారంతో స్టేజీ పైనుంచి వెళ్లిపోయారు. దీనికిసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేను విడాకులు తీసుకోలేదంటూ సోషల్ మీడియాలో పుష్పిక ఆవేదన
ఇది జరిగాక తనకు జరిగిన అవమానంపై పుష్పిక డిసిల్వా ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ..‘‘నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ నాపై నిందలు వేసిన వారు ఈ విషయాన్ని నిరూపించాలంటే నా విడాకుల పత్రాలు అందరికీ చూపించాలి’’ అంటూ సవాల్ విసిరారు. తనను అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ తెలిపారామె.‘‘ఒక మహిళ కిరీటం లాక్కునే మరో మహిళ ఎన్నటికీ నిజమైన రాణి అనిపించుకోదు’’అని కరోలిన్‌కు డైరెక్ట్ గా చురకలు వేసారు డిసిల్వా.
మిసెస్ డిసెల్వా… భర్తతో విడాకులు తీసుకోలేదు : కార్యక్రమం నిర్వాహకులు
ఈ ఘటనపై స్పందించిన నిర్వాహకులు విజేతగా నిలిచిన మిసెస్ పుష్పికా డిసెల్వా… భర్తతో విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు. స్టేజీ పైనే విజేతకు ఇలా జరగటం దురదృష్టకరమనీ..డి సిల్వా అవమానంతో స్టేజీపై నుంచి కిందకు దిగిపోయిన తరువాత వెంటనే తేరుకున్న పోటీ నిర్వాహకులు డి సిల్వాను క్షమాపణలు కోరుతూ, ఆమె కిరీటాన్ని తిరిగి ఇచ్చేశారు.
కాగ..పుష్పిక డి సిల్వా 2011లో మిస్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని డిసిల్వా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తెలియజేస్తూ..ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనకు జరిగిన ఘోర అవమానమని..దీనిపై న్యాయ విచారణ చేయాలని కోరారు.
Srilanka Bus Crashes : లోయలో పడ్డ బస్సు.. 14 మంది మృతి, 30మందికి తీవ్ర గాయాలు
Sri Lanka-Amazon : బికినీలు, ఇన్నర్ వేర్స్ అమ్మటం ఆపండీ..అమెజాన్ కు శ్రీలం సర్కార్ విన్నపం
Sri Lanka Burkhas: బుర్ఖా, ఫేస్ కవరింగ్లను నిషేదించిన శ్రీలంక ప్రభుత్వం
బీజేపీలో చేరిన తృణముల్ నేత…తప్పు చేశానంటూ స్టేజీ మీదే గుంజిళ్లు
వారెవ్వా.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు..
భారత్ తో కశ్మీరే మా సమస్య..చర్చలతోనే పరిష్కారం : పాక్ ప్రధాని