Mukesh Ambani : వారెన్ బఫెట్ తర్వాత అంబానీనే.

ప్రపంచ కుబేరుల జాబితాలో ఓ ర్యాంక్ ఎగబాకి 11 స్థానానికి చేరారు రిలియన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ.

Mukesh Ambani : వారెన్ బఫెట్ తర్వాత అంబానీనే.

Mukesh Ambani

Mukesh Ambani : ప్రపంచ కుబేరుల జాబితాలో ఓ ర్యాంక్ ఎగబాకి 11 స్థానానికి చేరారు రిలియన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌ ప్రకారం అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ 10 స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు.

శుక్రవారం రిలియన్స్ కంపెనీ షేర్ వ్యాల్యూ 4 శాతం పెరిగింది. అంటే ఒక్కరోజే అంబానీ సంపాదన మరో 3.7 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో అంబానీ మొత్తం సంపద 92.9 బిలియన్ డాలర్లకు చేరి ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంకి చేరారు. అంతకు ముందు అంబానీ 12వ స్థానంలో ఉన్నారు.

ఇక 11 స్థానంలో ఉన్న ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను వెనక్కి నెట్టారు ముఖేష్.. ఈ కంపెనీ మొత్తం విలువ 92.60 బిలియన్ డాలర్లుగా ఉంది.

రిలియన్స్ షేర్ వాల్యూ ఒక్కసారిగా 4 శాతం పెరగడానికి సెర్చి ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేయడమే అని తెలుస్తోంది. ఎందులో వాటాలు కొనుగోలు చేసిన మరుసటి రోజే భారీ లాభాలను ఆర్జించింది. దీంతో ముఖేష్ ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానానికి ఎగబాకారు.