మ‌హాత‌ల్లి : రైలు దిగేట‌ప్పుడు…కంగారులో క‌న్న‌బిడ్డ‌నే మ‌ర్చిపోయింది

10TV Telugu News

సాధార‌ణంగా మనం ఏ రైలో, ఆటో లేదు బస్సు ఎక్కిన‌ప్పుడు చేతిలో ఉన్న లగేజ్‌ను ప‌క్క‌న పెట్టి.. దిగేప్పుడు తీసుకుంటుంటాం. . కొందరైతే తీరా స్టాప్ రాగానే కంగారులో వ‌స్తువుల గురించి మ‌ర్చిపోయి బ‌స్సు దిగేస్తారు. అయితే బ్యాగ్‌, సెల్‌ఫోన్ వంటి వ‌స్తువులు మ‌ర్చిపోవ‌డం విన్నాం కానీ.. క‌న్న‌బిడ్డ‌ను మ‌ర్చిపోవ‌డం విన్నారా?

బుధవారం లండన్ లో ఓ మహిళ తన చంటి బిడ్డతో రైలులో ప్ర‌యాణిస్తున్న‌ది. అయితే తాను దిగాల్సిన దక్షిణ లండన్ లోని పెక్కాహ్యామ్ రే రైల్వే స్టేష‌న్‌ రాగానే ఆ మహాళ తన చంటి బిడ్డ సంగతి మర్చిపోయి ‌డావుడిగా రైలు దిగేసింది. కొంచెం దూరం న‌డ‌వ‌గానే చూసుకుంటే ప‌సిబిడ్డ లేద‌నే విష‌యం గుర్తొచ్చిందామెకు.


అప్ప‌టికే రైలు క‌ద‌ల‌డంతో ల‌బోదిబోమ‌ని గుండెలు బాధ‌కుంటూ స్టేష‌న్ సిబ్బందికి విష‌యం చెప్పి ప్రాదేయ‌ప‌డింది. వారు ముందు స్టేష‌న్లో రైలును కాసేపు ఆపి ఆమెను మ‌రొక రైల్లో ముందు స్టేష‌న్‌కు, త‌ర‌లించి త‌ల్లిబిడ్డ‌ను క‌లిపారు. రైలును కొంత స‌మ‌యం ఆప‌డం వ‌ల్ల అటుగా వెళ్లే రైళ్ల‌న్నీ ఆల‌స్య‌మ‌య్యాయి. రైల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజ‌న్లు క‌న్న‌బిడ్డ‌ను అలా ఎలా మ‌ర్చిపోయిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆ త‌ల్లి.. బిడ్డను రైలులో మ‌ర్చిపోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంద‌ట‌. అదే మ‌తిమ‌రుపు.

10TV Telugu News