Scotland : ఏడాది బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి.. ఇప్పుడు 74 ఏళ్ల వయస్సున్న మాతృమూర్తి విషాద గాథ

ఏడాది బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి విషాద గాథ తెలిస్తే ప్రతీ ఒక్కరు కన్నీరు పెడతారు. ఎవరైనా ఆస్థి కోసం పోరాడతారు.. హక్కుల కోసం పోరాడతారు. కానీ ఓ తల్లి ఏడాది వయసున్న బిడ్డను కోల్పోయి ఆ బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడింది..!!

Scotland :  ఏడాది బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి.. ఇప్పుడు 74 ఏళ్ల వయస్సున్న మాతృమూర్తి విషాద గాథ

Mum gets baby son's remains after 48 year fight

Scotland : ఏడాది బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి విషాద గాథ తెలిస్తే ప్రతీ ఒక్కరు కన్నీరు పెడతారు. ఎవరైనా ఆస్థి కోసం పోరాడతారు.. హక్కుల కోసం పోరాడతారు. కానీ ఓ తల్లి ఏడాది వయసున్న బిడ్డను కోల్పోయి ఆ బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడింది..!!

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన లిడియా రీడ్‌ అనే మహిళ 1975లో ఏడాది వయసు ఉన్న మగబిడ్డ ‘గ్యారీ’ రీరస్ అనే వ్యాధి సోకటంతో కోల్పోయింది. గర్భిణీ స్త్రీ రక్తంలోని ప్రతిరక్షకాలు ఆమె శిశువు రక్తకణాలను నాశనం చేసి చనిపోయేలా చేయడమే ఆ వ్యాధి లక్షణం. అలా బిడ్డను కోల్పోయింది లిడియా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అక్కడ ఆస్పత్రి రూల్స్‌ ప్రకారం..అంత చిన్న వయసులో చనిపోయిన చిన్నారులను ఆస్పత్రి యాజమాన్యమే ఖననం చేస్తుంది. అలా రీడ్ బిడ్డ ఖననం కార్యక్రమాలన్ని ఆస్పత్రి వర్గాలే నిర్వర్తించామని తెలిపాయి.

ఆమె ఆ బాధ నుంచి బయటపడ్డాక ఒక్కసారి తన బిడ్డను చూడాలని శవపేటికను తెరిచి చూపించాలని..బిడ్డను ఎక్కడ ఖననం చేసారో చెప్పమని ప్రాధేయపడింది. దీంతో ఆస్పత్రి యజమాన్యం అంగీకరించింది. రీడ్ కు ఆమె బిడ్డ మృతదేహాన్ని చూపించింది. కానీ రీడ్ మాత్రం అది నాబిడ్డ మృతదేహం కాదు అని వాదించింది. రీడ్‌కి తన కొడుకు అవయవాలు పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారా? లేక తొలగించారా? అన్న అనుమానంతో కోర్టు మెట్లు ఎక్కింది.

బిడ్డ మృతదేహం కోసం చాలా ఏళ్లు కోర్టులో పోరాడింది. చివరికి సెప్టెంబర్‌ 2017లో కోర్టు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆ బిడ్డను ఆమెకు చూపించమని ఆదేశించింది. ఖననం చేసిన ప్రదేశంలో బిడ్డ లేదని తేలింది. దీంతో ఆమె అనుమానం నిజమేనని రూఢీ అయ్యింది. తన బిడ్డకు చనిపోయిన తరువాత డాక్టర్లు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారని రీడ్‌ చెబుతోంది. కానీ మృతదేహాన్ని మాత్రం చూపించకుండా ఆస్పత్రి యాజమాన్యం తనను మోసం చేసిందని వాదిస్తోంది.

ఈక్రమంలో బిడ్డ సమాధిలో మృతదేహం ఆనవాళ్లు కూడా లేకపోవటం..ఆమె పోరాటం కారణంగా సదరు ఆస్పత్రి ఆల్డర్‌ హే బాగోతం బయటపడింది. చనిపోయిన పిల్లల శరీర భాగాలను ఆస్పత్రులు ఎలా చట్టవిరుద్ధంగా పరిశోధనలకు ఉపయోగిస్తున్నాయో రీడ్ పోరాటంతో బయటపడింది. దీంతో స్కాట్లాండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ చేసిన దర్యాప్తులో 1970 నుంచి 2000 మధ్య కాలంలో చిన్నపిల్లలకు సంబంధించి దాదాపు 6 వేల అవయవాలు, కణజాలం ఉంచినట్లు తేలింది. ఎట్టకేలకు ఆమె పోరాటం ఫలించి చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని (అవశేషాలు) తిరిగి పొందగలిగింది.

ఎలాగైతే చనిపోయేలోగా నా బిడ్డను చూడగలిగానని ఆనందం ఓ పక్క..ఏడాది బిడ్డను చేతులతో ఖననం చేయలేకపోయిన ఈ అమ్మ దుస్థితిని క్షమించు దేవుడా అంటూ హృదయవిదారకంగా ఏడ్చింది. కానీ నా బిడ్డ అవశేషాలను ఇన్నాళ్టికి చూడగలిగానంటూ ఆ పిచ్చి తల్లి ఉప్పోంగిపోయింది. అలా 48 ఏళ్లకు దక్కిన బిడ్డ అవశేషాలను శనివారం (మార్చి18,2023) నా కొడుకు అంత్యక్రియలు జరిపిస్తానని తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆనందబాష్పాలతో చెబుతోంది. ఇది ఆ తల్లి గెలుపు అనాలా? ఏమనాలో కూడా పరిస్థితి..

బిడ్డను కోల్పోయినా మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని..అది తన భాద్యత అనుకుని ఆ బాధ్యతను నెరవేర్చటానికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షించి 48 ఏళ్ల పోరాడిన ఆ తల్లి పోరాటపటిమకు చేతులెత్తి నమస్కరించాల్సిందే. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన తన బిడ్డ మృతదేహాన్ని తనివితీరా చూసుకుని మరీ ఖననం చేసింది ప్రస్తుతం 74 ఏళ్ల వయస్సున్న లిడియా రీడ్.