lockdownలో తెగ తినడం వల్ల వళ్ళొచ్చిందనుకుంది. ప్రెగ్నెంట్ అని తెలిసిన గంటలో సర్‌ప్రైజ్

lockdownలో తెగ తినడం వల్ల వళ్ళొచ్చిందనుకుంది. ప్రెగ్నెంట్ అని తెలిసిన గంటలో సర్‌ప్రైజ్

తాషా డేవిస్, 28 బరువు పెరిగానని అనుకుంది. లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా తినడమే దీనికి కారణమని భావించింది. సెప్టెంబర్ 1 మంగళవారం ఉదయం హాస్పిటల్‌కు వెళ్లి చెక్ చేసుకున్న గంటలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో కడుపునొప్పి వస్తుందని.. 6గంటలకు భాగస్వామి పార్టనర్ హెర్న్ 29తో విగన్ ఇన్ఫమరీకు వచ్చింది.



అప్పుడే ఆమె బాధకు, నొప్పులకు కారణం తెలిసింది. అవి పురిటినొప్పులని కన్ఫామ్ అయింది. షాక్‌తో పాటు సర్‌ప్రైజ్ కూడా అయ్యా. ఎప్పుడూ నాకు సడెన్‌గా నీరసంగా అనిపించడం వంటి లక్షణాలేవి కనిపించలేదు. డెలివరీకి 24గంటల ముందు వరకూ.. నాకు ప్రెగ్నెన్సీ అని తెలియలేదు.

24గంటల వరకూ కడుపునొప్పి అనిపించినా యూరిన్ కు కూడా వెళ్లలేదు. నిజంగా ఏదో ఇబ్బందేమో అనుకున్నా. అది చాలా భయంకరం. తెల్లవారుజామున 3గంటల సమయంలో హైపర్‌వెంటిలేటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే నిజమైన నొప్పులు మొదలయ్యాయి. అది చూసి నర్సులు మీరు ప్రెగ్నెంటా అని అడిగారు. నేను కాదని చెప్పాను.



టెస్టు చేయించుకున్న తర్వాత.. పాజిటివ్ అని వచ్చింది. అది తెలుసుకున్న తర్వాత షాక్ అయ్యాం. లాక్‌డౌన్ సమయంలో బయట చాలా తిరిగా. సరైన డైట్ ఫాలో అవకుండా దొరికిన ప్రతీ దానిని తిన్నా. అందుకే వెయిట్ పెరిగానని అనుకున్నా.

హాస్పిటల్ కు వెళితే ఏం చెప్తారో అని కూడా ఆలోచించలేదు. పరీక్షలు పూర్తయిన 15నిమిషాల తర్వాత నర్సు నా పేరు అనౌన్స్ చేసి గర్భిణీ అని చెప్పడంతో పాటు డెలివరీ సూట్ కూడా తొడిగారు.