6 Kg Baby : బాల భీముడు..! పుట్టుకతోనే రికార్డు.. ఆ శిశువు బరువు 6.3 కేజీలు

6 కిలోల బరువుతో పుట్టిన శిశువుని ఎప్పుడైనా చూశారా. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ, ఇప్పుడు అది జరిగింది. ఏంటి? షాక్ అయ్యారా? అవును.. ఆ శిశువు ఏకంగా 6.37 కిలోల బరువుతో పుట్టాడు.

6 Kg Baby : బాల భీముడు..! పుట్టుకతోనే రికార్డు.. ఆ శిశువు బరువు 6.3 కేజీలు

6 Kg Baby

6 Kg Baby : సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు ఎన్ని కిలోల బరువు ఉంటాడు. అంటే 3 కిలోలు ఉండొచ్చు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి మంచి పౌష్ఠికాహారం తీసుకుంటే 3 నుంచి 4 కిలోల మధ్య పుట్టొచ్చు. ఇది కామన్. ఇందులో ఆశ్చర్యం లేదు. కానీ.. 6 కిలోల బరువుతో పుట్టిన శిశువుని ఎప్పుడైనా చూశారా. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ, ఇప్పుడు అది జరిగింది. ఏంటి? షాక్ అయ్యారా? అవును.. ఆ శిశువు ఏకంగా 6.37 కిలోల బరువుతో పుట్టాడు.

Cary

Gita Shares : జాక్ పాట్ .. ఏడాదిలో రూ. లక్ష పెట్టుబడితో రూ.42 లక్షల సంపాదన

అమెరికా అరిజోనాకు చెందిన క్యారీ అనే మహిళ ఈ బిడ్డకు జననం ఇచ్చింది. పుట్టడం పుట్టడమే ఆ శిశువు రికార్డు క్రియేట్ చేశాడు. సాధారణంగా పుట్టే బరువు కన్నా రెట్టింపు బరువుతో పుట్టడం వైద్య చరిత్రలోనే ఇదే తొలిసారి అని ఆ పిల్లాడికి పురుడు పోసిన డాక్టర్లు చెప్పారు. శిశువు పుట్టాక 6 నుంచి 9 నెలల మధ్య ఉన్న పిల్లల సైజ్ తో ఉండటం.. చూసి తల్లే కాదు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. వైద్య చరిత్రలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు అని చెప్పారు.

Finnley

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని శిశువు తినడం వల్ల ఇలా ఒక్కసారిగా బరువు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కోసారి బరువు ఎక్కువగా ఉంటే డెలివరీ కష్టం అవుతుందన్నారు. అయితే, ఈ పిల్లాడు 6 కిలోల బరువున్నా డెలివరీకి పెద్దగా కష్టపడలేదని.. మిగతా మహిళలకు చేసినట్టే సిజేరియన్ ఆపరేషన్ చేశామని డాక్టర్లు చెబుతున్నారు.

cary

ఇప్పుడీ బాలుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాల భీముడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ బుడ్డోడికి ఫిన్లీ అని పేరు పెట్టారు. కాగా, క్యారీకి రెండేళ్ల వ్యవధిలో 17 సార్లు గర్భస్రావమైంది. తన 30 ఏళ్ల కెరీర్ లో ఇంత బరువైన శిశువుకు జన్మనివ్వడం చూడలేదని క్యారీ వ్యక్తిగత డాక్టర్ చెప్పారు. ఇక ఆ బుడ్డోడికి వేసేందుకు 9 నెలల బాబుకి సరిపోయే డ్రెస్ కొనుక్కొని రావాల్సి వచ్చింది.