Musharraf passes away: ప్రధానికి తెలియకుండానే..! భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధానికి కారకుడైన ముషారఫ్ ..

1999 మార్చిలో కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని సైన్యాధిపతి హోదాలో ముషారఫ్ పంపించాడు. పాక్ సైన్యం కదలికలను గుర్తించిన భారత్ సైన్యం అప్రమత్తమైంది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. ముషారఫ్ సైన్యాధిపతి కావడానికి కారణం మాజీ ప్రధాని నవాజ్ షరీఫే. ఆయనకు తెలియకుండానే కార్గిల్ యుద్ధంతో పాటు పలు వివాదాలకు ముషారఫ్ కారణమయ్యాడు.

Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, జనరల్ పర్వేజ్ ముషారఫ్ (79) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముషారఫ్.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 1964లో పాకిస్థాన్ మిలిటరీలో చేరిన ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ జనరల్ స్థాయికి చేరుకున్నాడు. పాకిస్థాన్ ప్రధానిగా ముషారఫ్ ఎనిమిదేళ్లు పనిచేశాడు. అయితే, భారత్, పాకిస్తాన్ మధ్య 1999లో మే – జూలై నెలల్లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫే. ఆ దేశ ప్రధానికి తెలియకుండానే సైన్యాన్ని సరిహద్దులకు పంపించి యుద్ధానికి కారకుడిగా మారాడు. అనుకోని యుద్ధం గురించి అప్పటి భారత్ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి, అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాబ్ షరీఫ్‌కు ఫోన్ చేసేవరకు తెలికపోవటం గమనార్హం.

Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

1999 మార్చిలో కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని ముషారఫ్ పంపించాడు. పాక్ సైన్యం కదలికలను గుర్తించిన భారత్ సైన్యం అప్రమత్తమైంది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. ముషారఫ్ సైన్యాధిపతి కావడానికి కారణం మాజీ ప్రధాని నవాజ్ షరీఫే. ఆయనకు తెలియకుండానే కార్గిల్ యుద్ధంతో పాటు పలు వివాదాలకు ముషారఫ్ కారణమయ్యాడు. కార్గిల్ యుద్ధంలో భారత్ సైన్యం పైచేయి సాధించిన తరువాత ముషారఫ్, షరీఫ్ మధ్య విబేధాలు మొదలయ్యాయి. దీంతో ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముషారఫ్ స్థానంలో ఖ్వాజా జియాయుద్ధీన్‌కు బాధ్యతలు అప్పగించాలని భావించాడు. ఈ విషయం తెలుసుకున్న ముషారఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి షరీఫ్ ను గద్దెదించాడు.

Musharraf: పాకిస్తాన్‌కు ముషారఫ్.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ

దేశంలో సైనిక పాలన విధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. 2001 జూన్ లో ముషారఫ్ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 2007లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి దేశ అధ్యక్ష పగ్గాలు అందుకున్నాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముషారఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. 2013లో పాక్‌కు తిరిగొచ్చిన ముషారఫ్ మళ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీచేయాలని భావించాడు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ముషారఫ్ పై అనర్హత వేటు పడింది.

ట్రెండింగ్ వార్తలు