బ్రిటన్ ఈ నలుగురు డాక్టర్లకు నివాళి అర్పిస్తుంది. ఎందుకంటే?

బ్రిటన్ ఈ నలుగురు డాక్టర్లకు నివాళి అర్పిస్తుంది. ఎందుకంటే?

ద యునైటెడ్ కింగ్‌డమ్ ఆ నలుగురు డాక్టర్లకు నివాళి అర్పిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమే క్రమంలో కుటుంబాన్ని వదిలి రోగుల ట్రీట్‌మెంట్‌పైనే ఫోకస్ పెట్టి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. కరోనాకు చికిత్స చేస్తూ యూకేలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లలో అల్ఫా స అదూ, అంజద్ ఎల్ హరానీ, అదిల్ ఎల్ తయార్, హబీబ్ జైదీలు ఉన్నారు. వీరంతా ఆఫ్రికా, ఆసియా, మధ్య ఆసియా సంతతికి చెందిన వారు. ఆ డాక్టర్లు చేసిన సేవ ఎనలేనిదని బ్రిటిష్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డా.సల్మాన్ వఖార్ అంటున్నారు. 

‘దశాబ్దాలుగా పేషెంట్లకు సర్వీస్ అందిస్తున్న సీనియర్ డాక్టర్లు కుటుంబాలకు దూరంగా ఉంటూ.. హాస్పిటల్‌కే పరిమితమయ్యారు. ఈ మహమ్మారిపై పోరాడే క్రమంలో వారు ఎనలేని త్యాగం చేశఆరు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించి మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవాలి. ఇళ్లకే పరిమితం అవ్వడం మంచిది’ అని ఆయన అన్నారు. యూకేలో 29వేల 474మందికి వైరస్ సోకితే అందులో 2వేల 352మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణత్యాగం చేసి లండన్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకున్న డాక్టర్ల గురించి వివరాలిలా: 

అంజద్ ఎల్ హరానీ: సూడాన్ పుట్టిన ఆరుగురి సంతానంలో ఈయన రెండో వాడు. ఈయనొక ENTడాక్టర్. 55ఏళ్ల వయస్సులో హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ ఇస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు సమక్షంలో ఆయనను ఖననం చేశారు. 

హబీబ్ జైదీ: పాకిస్తానీ సంతతికి చెందిన జనరల్ ప్రాక్టీషనర్ హబీబ్. 50ఏళ్ల క్రితమే లండన్ వెళ్లి స్థిరపడ్డారు. 76ఏళ్ల వయస్సున్నప్పటికీ హాస్పిటల్లోనే గడిపారు. కండిషన్ ను బట్టి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆయన మరణం తర్వాత అతని భార్యను ఐసోలేషన్ కు పంపారు. 

అదిల్ ఎల్ తయార్: ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కన్సల్టెంట్ గా పనిచేసే ఈయన 64ఏళ్ల వయస్సులోనూ సర్వీస్ అందించారు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్ గా పనిచేశారు. అక్కడే ఆయనకు కరోనా సోకినట్లు కుటుంబ సభ్యలు భావిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయిన ఆయనకు చివరి దశలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. 

అల్ఫా స అదు: నైజీరియాలో పుట్టిన స అదు.. 40ఏళ్లుగా లండన్‌లో డాక్టర్‌గా సర్వీస్ చేస్తున్నారు. 68ఏళ్ల వయస్సులో వైరస్ సోకినప్పటికీ 2వారాలు పోరాడి  ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే మరణించారు. 

Also Read | ఎంసెట్ పరీక్షలు వాయిదా.. దరఖాస్తు తేదీలు పొడిగింపు