నీది 12 అంగుళాలే, నాది 14 అంగుళాలు.. పొడవైన అరటిపండు నాదంటే నాదని వాదన

నీది 12 అంగుళాలే, నాది 14 అంగుళాలు.. పొడవైన అరటిపండు నాదంటే నాదని వాదన

my banana is longest than yours: ఇటీవల ఇంగ్లండ్ లో పౌలా అనే మహిళ మార్కెట్ లో కొన్న ఓ అరటిపండు దాదాపు 12 అంగుళాలు(అడుగు సైజు) ఉంది. దీంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే ఇది అతి పొడవైన అరటిపండు. నా దగ్గర మాత్రమే ఉంది. ఇంత పొడవైన దాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇది మామూలు అరటి పండ్లకంటే 2, 3 రెట్లు పెద్దగా ఉంది. పొడవే కాదు చాలా టేస్టీగా ఉంది. గతంలో తిన్న వాటికంటే ఇది చాలా తియ్యగా ఉంది. నా జీవితంలో ఇదే బెస్ట్” అని పౌలా చెప్పుకొచ్చింది. ఇలా చెప్పడమే కాదు ఆ అరటిపండును పలు యాంగిల్స్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వార్త వైరల్ అయ్యింది.

Woman Spots Banana The Size of Her Arm, Says 'It was the Most Delicious Banana She's Ever Eaten' | India.com

ఆ తర్వాత మిక్ బ్రౌన్ స్టేక్స్ అనే వ్యక్తి అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. తన దగ్గర పౌలా చూపిన దానికంటే పొడవైన అరటిపండు ఉందని చెప్పాడు. నీది 12 అంగుళాలే ఉంది, నాది ఏకంగా 14 అంగుళాలు ఉంది.. కావాలంటే చూడు అని.. తన దగ్గరున్న అరటిని టేప్ తో కొలిచి మరీ చూపించాడు మిక్. బ్రిటన్ లో బిగ్గెస్ట్ బనానా ఇదే. సూర్యుడంత పొడవు ఉంది అని కామెంట్ చేశాడు మిక్.

The wood machinist's banana measures 14 inches long

ఇలా పౌలా, మిక్.. ఇద్దరూ.. పోటీలు పడుతున్నారు. నాదే పొడవైనది అంటే కాదు కాదు.. నాది నీకన్నా పొడవైనదని వాదించుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా నవ్వుకుంటున్నారు. మీరు, మీ పొడవు గోల.. ఆపండ్రోయ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Mick Brown stakes his claim to having Britain’s biggest bananaMick says of his banana: 'It’s even as tall as The Sun'

కాగా, ఈ అరటిపండ్లను చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇప్పటివరకు పెద్ద పెద్ద కూరగాయాల్ని చూశాం. కానీ, ఇంత పెద్ద అరటిపండును చూడలేదంటున్నారు. కాగా, ఈ అరటిపండు చెట్టున ఉండగా.. దానికి రోజువారీ అందాల్సిన పొటాషియం కంటే ఎక్కువ మోతాదులో అంది ఉంటుందనీ… అందుకే ఈ పండ్లు అంతలా పొడవుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.