మయన్మార్ లో ఎన్నికలు, గెలుపు దిశగా సూకీ!

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 09:32 AM IST
మయన్మార్ లో ఎన్నికలు, గెలుపు దిశగా సూకీ!

Myanmar Election : మయన్మార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నొబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువ శాతం సూకీవైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకు భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందు రావడమని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



75 ఏళ్ల సూకీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్దులకు సైతం ముందస్తు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతినిచ్చింది. దీంతో చాలా మంది వృద్ధులు పోలింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో 90 రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి. దేశంలో మొత్తం 3.8 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 50 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉండడం గమనార్హం.



ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడ్డారు. దీంతో ఓటింగ్ శాతం అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.



https://10tv.in/dubbaka-by-poll-who-is-the-winner-hot-hot-talk/
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న క్రమంలో..పోలింగ్ కేంద్రాల్లో పలు నిబంధనలు విధించారు. మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటేజర్లు, థర్మల్ చెకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.



ఐదు దశాబ్దాల సుదీర్ఘ సైనిక పాలన అనంతరం మయన్మార్ లో మొట్టమొదటిసారిగా 2015లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగిన సంగి తెలిసిందే. నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ (NLD) చెందిన సూకీ తొలిసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. సైనిక, ప్రభుత్వ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.



ఈ క్రమంలో…పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే భావన ఓటర్లలో నెలకొందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా సూకీకి ఎక్కువ ప్రజాదరణ ఉండడం, ప్రతిపక్షాల ప్రభావం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి సూకీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.