బౌద్ధ సన్యాసి ఆశ్రమంలో వేలకొద్దీ పాములు..వాటిని ఏం చేస్తున్నారంటే

10TV Telugu News

Myanmar buddhist Ashram snakes : వన్యప్రాణులను అక్రమంగా విక్రయించడంలో మయన్మార్ ప్రపంచంలోనే కేంద్ర బిందువుగా మారింది. స్థానికంగా ఉండే పాములను పట్టుకొని తరచుగా పొరుగు దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌కు అక్రమంగా రవాణా చేస్తుంటారు. మయన్మార్‌లోని యాంగోన్‌లో ఉన్న ఓ బౌద్ధ ఆశ్రమంలో వేలకొద్దీ పాములు కనిపిస్తుంటాయి. ఎన్నో రకాల పాములు అక్కడ జరజరాపాకుతుంటాయి. బుద్ధుడి విగ్రహాలపైనా పెద్ద పెద్ద కొండచిలువలు కనిపిస్తుంటాయి. అలా ఆశ్రమంలో ఎక్కడ చూసినా పాములే కనిపిస్తుంటాయి. ఓసన్యాసి ఆశ్రమంలో అన్ని పాములు ఉండటానికి కారణమేంటంటే..మయన్మార్ లో వన్యప్రాణుల అక్రమరవాణా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. పాములతో పాటు పలు రకాల వన్యప్రాణుల్ని పట్టుకుని చైనా,థాయ్ లాండ్ వంటి దేశాలకు అమ్మేస్తుంటారు. వాటిని చైనాలో వండుకుని తినేస్తుంటారు. అక్రమ రవాణాలో పాములు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతుంటాయి. అలా పాముల అమ్మకం గురించి తెలిసిన విలాతా అనే ఓ బౌద్ధ సన్యాసి వేలాది జాతులకు చెందిన పాములకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వేలాదిరకాల పాముల్ని సంరక్షిస్తున్న విలాతా పాముల్ని మెడలో వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వివరాల్లోకి వెళితే.. మయన్మార్ లోని సీక్తా తుఖా టెటూ అనే బౌద్ధ ఆశ్రమంలో విలాతా అనే 69 ఏళ్ల బౌద్ధ సన్యాసి కొండ చిలువ, త్రాచుపాము, వైపర్లు వంటి సరీసృపాలకు (పాములకుఆశ్రయం కల్పించి వాటిని రక్షిస్తున్నారు. ఐదు సంవత్సరాల నుంచి పాముల్ని సంరక్షిస్తున్నారాయన. మన స్వార్థం కోసం ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగే వన్యప్రాణుల్ని అక్రమ రవాణా చేయటం దారుణమని ఆయన వాపోయారు. 

ఈ సందర్భంగా బౌద్ధ సన్యాసి విలాతా మాట్లాడుతూ.. పాములను వ్యాపారం అన్యాయమనీ..వాటిని అ‍మ్మడం, చంపేయండం చూసి చలించిపోయాననీ..అందుకే పాముల్ని సంరక్షిస్తున్నానని తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలని తాను అనుకున్నాననీ అందుకే స్థానికులుతోపాటు, ప్రభుత్వ సంస్థలు వివిధ చోట్ల బంధించిన పాములను నా వద్దకు తీసుకొస్తారని వాటి సంరక్షణ, బాగోగులు చూస్తుంటానని తెలిపారు.అలా వాటి బాగోగులు చూసి తిరిగి అడవిలో విడిచిపెడుతుంటానని తెలిపారు. అవి అడవిలో తిరిగి వాటి జీవితాన్ని గడపగలిగేలా సిద్ధం చేస్తానని అప్పటి వరకూ వాటిని ఆశ్రయంలో ఉంచి వాటికి భ్రదత కల్పిస్తానని..అలా చాలా పాముల్ని తిరిగి అడవిలో వదిలిపెట్టానని..కొన్ని పాముల్ని హ్లావ్గా నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టానని చెప్పారు.పాములు స్వేచ్చగా అడవిలోకి వెళ్లడం తనకు చాలా సంతోషంగా అనిపిస్తుందని ప్రకృతి జీవులు ప్రకృతిలోనే జీవించాలని వాటికి ఆ స్వేచ్చను ఇవ్వాలని మనిషి స్వార్థం కోసం వన్యప్రాణుల్ని వినియోగించుకోకూడదని సూచించారు.కానీ తాను అడవిలో వదిలిపెట్టిన పాముల్ని ప్రజలు వాటిని తిరిగి పట్టుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తే తనకు చాలా బాధగా ఉంటుందని ఆందోళనకలుగుతుందని అన్నారు. ప్రభుత్వం వన్యప్రాణుల అక్రమ రవాణాపై దృష్టి పెట్టి దాన్ని అరికట్టాలని సూచించారు. విలాతా రక్షిస్తున్న పాములకు ఆహారం అందించటానికి 300 డాలర్లు విరాళాలు అసవరం అవుతున్నాయని తెలిపారు.

×