Myanmar: అవినీతి కేసులో ఆంగ్ సాన్ సూకీకి 6 ఏళ్ల జైలు

ప్రపంచంలో ప్రముఖ రాజకీయ ఖైదీగా పేరు ఉన్న సూకీ మయన్మార్‭లోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి చైర్ పర్సన్. 1990 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ 59 శాతం ఓట్లతో 485 స్థానాలకు గాను 382 గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికలకు ముందే సైన్యం ఆమెను నిర్బంధించింది. మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను ఫిబ్రవరి 1న మళ్లీ అరెస్టు చేశారు.

Myanmar: అవినీతి కేసులో ఆంగ్ సాన్ సూకీకి 6 ఏళ్ల జైలు

Myanmar court jails Suu Kyi for six years for corruption

Myanmar: మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఒక అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అవినీతి కేసులో కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించినట్లు అనధికార వర్గాలు వెల్లడించినట్లు తెలిపారు. సొంతింటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని రాయితీ ధరకు లీజుకు తీసుకున్నారని, దీనితో పాటు దేశంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించేందుకు ఆమె స్థాపించిన ‘డా ఖిన్ క్యీ’ ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రుజువు కావడంతో శిక్షను ఖరారు చేశారట.

1989-2010 మధ్య సూకి పదేళ్లు గృహ నిర్బంధంలో ఉన్నారు. సైన్యం ఆమెపై మోపిన అభియోగాల్లో దోషిగా తేల్చి గృహ నిర్బంధం చేశారు. వాకీటాకీలను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని, 6 లక్షల డాలర్ల నగదును లంచంగా తీసుకున్నారని అంతకు ముందు ఐదేళ్లు శిక్ష విధించారు. ఇక ప్రస్తుతం మరిన్ని కేసులు ఆమెపై మోపారు. ఇవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే 77 ఏళ్ల సూకీ.. తన జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

ఇకపోతే, ప్రపంచంలో ప్రముఖ రాజకీయ ఖైదీగా పేరు ఉన్న సూకీ మయన్మార్‭లోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి చైర్ పర్సన్. 1990 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ 59 శాతం ఓట్లతో 485 స్థానాలకు గాను 382 గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికలకు ముందే సైన్యం ఆమెను నిర్బంధించింది. మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను ఫిబ్రవరి 1న మళ్లీ అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం మియన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఆమెను పదవి నుంచి తప్పించి నిర్బంధంలోకి తీసుకున్నారు.

China-Taiwan conflict: చెప్పినట్టుగానే మళ్ళీ తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన చైనా