Myanmar: ఓ వేడుకపై మయన్మార్ వైమానిక దళం భీకరదాడి.. 100 మంది మృతి

సైన్యం చేసిన దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గుటెర్రస్ ఖండించారు. మయన్మార్ ప్రజలపై హింసను ఆపాలని మరోసారి ఆయన చెప్పారు.

Myanmar: ఓ వేడుకపై మయన్మార్ వైమానిక దళం భీకరదాడి.. 100 మంది మృతి

Myanmar

Myanmar: ఓ గ్రామంలో జరుగుతున్న వేడుకపై మయన్మార్ (Myanmar) వైమానిక దళం భీకరదాడి చేసింది. దీంతో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని మయన్మార్ ఆర్మీ సమర్థించుకుంటూ ప్రకటన చేసింది. తిరుగుబాటుదారులు ఓ గ్రామంలో ఓ వేడుక ఏర్పాటు చేశారని చెప్పింది. ఆ ఉగ్రవాదులకు కొందరు పౌరులు సహకారం అందించారని వివరించారు.

తాము చేసిన దాడిలో కొందరు అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైన్యం తెలిపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి వాయవ్య మయన్మార్ లోని సగాయింగ్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. మయన్మార్ లో కొంత కాలంగా ఇంతటి భీకర దాడి జరగలేదు.

మయన్మార్ లో ప్రజాస్వామ్యయుతంగా 2016 నుంచి 2021 ఫిబ్రవరి వరకు కొనసాగిన ఆంగ్‌ సాన్‌ సూకీ పాలన ఆ తర్వాత మిలటరీ తిరుగుబాటుతో ముగిసిన విషయం తెలిసిందే. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీకి అవినీతి కేసులో మిలటరీ ప్రభుత్వ జైలు శిక్ష కూడా విధించింది.

దీంతో ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నప్పటి నుంచి మిలటరీ పాలనపై తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా సైన్యం చేసిన దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ (U.N. Secretary-General) ఆంటోనియో గుటెర్రస్ ఖండించారు. మయన్మార్ ప్రజలపై హింసను ఆపాలని మరోసారి ఆయన చెప్పారు. మయన్మార్ మిలటరీ మాత్రం తాము చేసిన దాడిని సమర్థించుకుంటోంది.

New York metro : మెట్రోలో పరుపు వేసుకుని పడుకున్న వ్యక్తి వీడియో వైరల్