Pray For Myanmar : మయన్మార్​ మిలటరీ పాలనపై..మిస్ యూనివర్శ్ పోటీల వేదికపై నిరసన గళం…ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి

మిస్ యూనివర్శ్ పోటీల వేదికపై మయన్మార్​ మిలటరీ పాలనపై నిరసన గళం వినిపించింది మయన్మార్ యువతి. ‘Pray For Myanaar’ ప్లకార్డ్ తో మయన్మార్లో మిలటరీ పాలనపై ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి చేసింది. మయన్మార్ లో మిలటరీ చేసే దురాగతాలకు ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది మయన్మార్ కు చెందిన థుజార్ వింత్ లువిన్ అనే సుందరి.

Pray For Myanmar : మయన్మార్​ మిలటరీ పాలనపై..మిస్ యూనివర్శ్ పోటీల వేదికపై నిరసన గళం…ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి

Pray For Myanmar

Pray For Myanmar our people are dying : మిస్ యూనివర్శ్ పోటీల వేదికపై మయన్మార్​ మిలటరీ పాలనపై నిరసన గళం వినిపించింది మయన్మార్ యువతి. ‘Pray For Myanaar’ ప్లకార్డ్ తో మయన్మార్లో మిలటరీ పాలనపై ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి చేసింది. మయన్మార్ లో మిలటరీ చేసే దురాగతాలకు ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది మయన్మార్ కు చెందిన థుజార్ వింత్ లువిన్ (Thuzar wint Luwin)అనే సుందరి. మిస్ యూనివర్శి పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్ లో ఓడిపోయిన థుజార్ వింత్ లువిన్ ఈ పోటీల వేదికనే తన నినాదంగా మార్చుకుంది. మయన్మార్ సంప్రదాయ దుస్తుల్లో వేదికపైకి వచ్చి మయన్మార్ లో సైనికులు చేస్తున్న దురాగతాలపై ఆదివారం (మే 16,2021) నిరసన గళం వినిపించింది. మయన్మార్ పరిస్థితిపై ప్రపంచం గొంతెత్తాలని విశ్వసుందరి పోటీల వేదికపై నిలబడి విజ్ఞప్తి చేసింది.

మయన్మార్ లో ఆర్మీ జుంటా ఎన్నెన్ని అకృత్యాలకు..దురాగతాలకు పాల్పడిందో తెలిసిందే. ఆ అణచివేతపై గళమెత్తేందుకు విశ్వ సుందరి పోటీలనే వేదికగా ఎంచుకుంది మయన్మార్ సుందరి థుజార్ వింత్ లువిన్. పోటీల్లో పాల్గొన్న లువిన్.. ‘మయన్మార్ కోసం ప్రార్థించండి’ అంటూ ప్లకార్డ్ ను ప్రదర్శిస్తూ.. మయన్మార్ సంప్రదాయ దుస్తుల్లో వేదికపై నడిచింది. ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి చేసింది.

సైన్యం దురాగతాలకు తమ ప్రజలు రోజూ చనిపోతూనే ఉన్నారని ఆమె పోటీలో భాగంగా ఇచ్చిన వీడియో సందేశంలో తెలిపింది. దయచేసి ప్రపంచమంతా మయన్మార్ కోసం గళమెత్తాలని విజ్ఞప్తి చేసింది. మిస్ యూనివర్స్ మయన్మార్ గా గెలిచిన తాను.. మిలటరీ గ్రూపు పాలనపై ఎప్పటికప్పుడు గొంతెత్తుతూనే ఉన్నానని ఈ సందర్భంగా థుజార్ వింత్ లువిన్ తెలిపింది.

మిస్ యూనివర్స్ ఫైనల్ రౌండ్ లో ఆమె ఓడిపోయినా.. ఉత్తమ జాతీయ వస్త్రధారణ అవార్డు (Best National Attire Award) గెలుచుకుంది. ఫిబ్రవరి 1న మొదలైన మయన్మార్ మిలటరీ గ్రూపు పాలనలో ఇప్పటిదాకా 790 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 వేల మందిని అరెస్ట్ చేశారు. 4 వేల మందిని ఇళ్లలోనే బందీలుగా చేశారు.

మయన్మార్‌‌‌‌‌‌‌‌లో మారణహోమం..
కాగా..మయన్మార్‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఆర్మీ జుంటా మారణహోమం సాగిస్తోంది. సైన్యం అరాచకాల్ని ప్రజలు ఎదిరిస్తుండటంతో రక్తం ఏరులై పారుతోంది. మయన్మార్​కు స్వాతంత్ర్యం వచ్చాక ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, కొద్దికాలం క్రితమే ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న క్రమంలో ఇక తమ కష్టాలు గట్టెక్కాయని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నా క్రమంలో తిరిగి మయన్మార్ లో సైనిక పాలన ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోంది. ఈ పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఎన్నో ఏండ్లు పోరాడి గృహ నిర్బంధంలో గడిపిన నోబెల్‌‌‌‌‌‌‌‌ పీస్​ ప్రైజ్​ గ్రహీత ఆంగ్ సాన్ సూకీని తప్పించి తిరిగి సైనిక జుంటా అధికారం దక్కించుకోవడం ప్రపంచ దేశాలను షాక్​కు గురిచేసింది. సూకీతోపాటు రాజకీయ నేతలందరినీ నిర్బంధించడంతో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ‘‘నిర్బంధంలో ఉంచిన నాయకులు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేసి ప్రజల ఇష్టానికి అనుగుణంగా వ్యవహరించాలి. మయన్మార్‌‌‌‌‌‌‌‌లో పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి”అని యునైటెడ్​ నేషన్స్​ చీఫ్​ గుటెర్రస్‌‌‌‌‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేశారు.

గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌డీ విజయం సాధించింది. సైన్యం మద్దతు ఉన్న యూనియన్‌‌‌‌‌‌‌‌ సాలిడారిటీ అండ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఓటమిపాలైంది. మయన్మార్​లో సైనిక తిరుగుబాటు మరోసారి మయన్మార్ సైనిక పాలనలో వెళ్లిపోయింది. తాము మద్దతిచ్చిన పార్టీ ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు పాలన పగ్గాలను చేతుల్లోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పాలన చేజిక్కించుకున్న సైన్యం ప్రజాస్వామ్య ఆందోళనకారులను ఊచకోత కోస్తోంది. సూకీ నుంచి పాలన పగ్గాలు లాక్కున్న సైనిక అధికారులు దేశంలో మారణహోమం సృష్టిస్తున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాన్యులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్నారు. సైనికులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.