టాంజానియాలో వింత వ్యాధి..రక్తపు వాంతులతో పిట్టల్లా రాలిపోతున్న జనాలు

టాంజానియాలో వింత వ్యాధి..రక్తపు వాంతులతో పిట్టల్లా రాలిపోతున్న జనాలు

Mystery Illness In Tanzania: ఆఫ్రికాలోని టాంజానియాలో ఓ వింత వ్యాధి ప్రజల్ని బలి తీసుకంటున్నారు. ఈ వ్యాధి బారిన పడిన జనం రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. అలా ఇప్పటికే 18మంది ఈ వింత వ్యాధికి బలైపోయారు. ఈ విషయాన్ని స్వయంగా టాంజానియాలోని ఎంబేయా ప్రాంతం చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫెలిస్టా కిసాండు తెలిపినట్టు వార్తా సంస్థలు ప్రచురించాయి. ప్రజలు ఇలా రక్తపు వాంతులతో ప్రాణాలు కోల్పోవటంపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతోంది.

ఈ వ్యాధి పెద్దగా వ్యాపించలేదని..ఎవ్వరూ భయపడవద్దని నిపుణులు ఈ వ్యాధిపై పరిశీలిస్తున్నారని ఫెలిస్టా తెలిపారు. ఈ వింత వ్యాధికి ఇప్పటికే 15 మంది చనిపోగా, 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ వ్యాధి బారిన పడినవారు ఎక్కువగా పురుషులే కావటం గమనించాల్సిన విషయం. కాగా..రక్తపు వాంతులు రావడానికి కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. ఇంకా పరిశీలనలోనే ఉంది.

బాధితుల నుంచి మృతుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు. కాగా..ఈ వింత వ్యాధి పెద్దగా వ్యాపించలేదని టాంజానియా వైద్య శాఖ మంత్రి డోరతీ గ్వాజిమా స్పష్టం చేస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా వాటర్ శాంపిల్స్, ఆహారం శాంపిల్స్, పేషెంట్ల వద్ద బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నామని ఫెలిస్టా తెలిపారు. ఆయా శాంపిల్స్‌లో పాదరసం ఆనవాళ్లు ఉన్నాయేమోనని పరిశీలిస్తామన్నారు. ఈ వింత వ్యాధి విషయంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయాలని వైద్య శాఖ మంత్రి ఆదేశించారు.