North Korea: మళ్ళీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ ఉత్తర కొరియా.. అణ్వస్త్రాలను వాడితే ఊరుకోబోమని అమెరికా హెచ్చరిక

ఉత్తర కొరియా మళ్ళీ రెండు బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేసింది. దాదాపు రెండు వారాల తర్వాత చేసిన తొలి ప్రయోగం ఇది. దీంతో ఉత్తర కొరియాపై అమెరికా మండిపడింది. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను వాడితే ఆ దేశంలోని కిమ్ పాలన అంతమవుతుందని హెచ్చరించింది. టోంగ్చోన్ లోని తూర్పు తీర ప్రాంతం మీదుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసిందని దక్షిణ కొరియా అధికారులు చెప్పారు. ఈ రెండు క్షిపణులు సముద్ర తలానికి 24 కిలోమీటర్ల ఎత్తు నుంచి దాదాపు 230 మీటర్ల దూరం వెళ్లాయని వివరించారు.

North Korea: మళ్ళీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ ఉత్తర కొరియా.. అణ్వస్త్రాలను వాడితే ఊరుకోబోమని అమెరికా హెచ్చరిక

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day

North Korea: ఉత్తర కొరియా మళ్ళీ రెండు బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేసింది. దాదాపు రెండు వారాల తర్వాత చేసిన తొలి ప్రయోగం ఇది. దీంతో ఉత్తర కొరియాపై అమెరికా మండిపడింది. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను వాడితే ఆ దేశంలోని కిమ్ పాలన అంతమవుతుందని హెచ్చరించింది. టోంగ్చోన్ లోని తూర్పు తీర ప్రాంతం మీదుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసిందని దక్షిణ కొరియా అధికారులు చెప్పారు.

ఈ రెండు క్షిపణులు సముద్ర తలానికి 24 కిలోమీటర్ల ఎత్తు నుంచి దాదాపు 230 మీటర్ల దూరం వెళ్లాయని వివరించారు. ఉత్తర కొరియా చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. క్షిపణి పరీక్షలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని అన్నారు. బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేయకూడదని నిషేధం విధిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన నిబంధనలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని చెప్పారు.

ఉత్తర కొరియా పాల్పడ్డ చర్యలను తాము కూడా గుర్తించామని జపాన్ తెలిపింది. ఉత్తర కొరియా తాజా పరీక్షలపై అమెరికా, జపాన్ తో దక్షిణ కొరియాకు చెందిన అధికారులు ఫోనులో మాట్లాడారు. ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న ‘అణు’ ముప్పును ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని మూడు దేశాల నేతలు అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..