ట్రంప్ టూర్ : నమస్తే ట్రంప్‌కు రూ. 120 కోట్లు ఖర్చు

  • Edited By: madhu , February 23, 2020 / 08:35 AM IST
ట్రంప్ టూర్ : నమస్తే ట్రంప్‌కు రూ. 120 కోట్లు ఖర్చు

అమెరికా అధ్యక్షుడు గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్‌ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్‌లో మోతేరా స్టేడియంలో జరుగుతున్న ‘నమస్తే ట్రంప్‌’ ఈవెంట్‌ కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌ను ప్రభుత్వం మాత్రం నిర్వహించడం లేదు.

ఈవెంట్ ఖర్చుపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ‘నాగ‌రిక్ అభినంద‌న్ స‌మితి’ అనే ప్రైవేటు సంస్థ ట్రంప్‌ను ఆహ్వానించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.  ట్రంప్ రాకకోసం అహ్మాదాబాద్ న‌గ‌రం సుంద‌రీక‌రించ‌డం.. భారీ భారీ కటౌట్లు పెట్టడంపై అనుమానాలు రేకెత్తాయి. అహ్మదాబాద్ టూర్ తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయన సతీమణితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్రంప్‌ను స్వాగతించనున్నారు. ట్రంప్ పర్యటన ఆగ్రాను అందంగా తీర్చి దిద్దుతున్నారు. పరిసరాల్లోని పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ట్రంప్‌ టూర్‌పై దేశీయ కార్పోరేట్లలో భారీ ఆశలున్నాయి. అమెరికా అధ్యక్షుడి రాక సందర్భంగా పలు ఒప్పందాలు జరుగుతాయని ఎదురుచూస్తున్నారు. మినీ ట్రేడ్ డీల్ ఉంటుందని, అమెరికన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

Read More : ట్రంప్ టూర్ షెడ్యూల్..వివరాలు