ఈ బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తే.. లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటుంది!

  • Published By: sreehari ,Published On : October 10, 2020 / 03:57 PM IST
ఈ బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తే.. లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటుంది!

nanowire battery : సైంటిస్టులు ఎప్పడూ ఏదో ఒకదానిపై ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొత్తగా ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటారు. ఇలా ఒకదాన్ని కనిపెట్టే క్రమంలో మరొకటి అనుకోకుండానే కనిపెట్టేయడం చాలా జరుగుతుంటాయి. గతంలో సైంటిస్టులు యాక్సడెంటల్ గా అనేక వస్తువులను కనిపెట్టేశారు. అందులో పేస్ మేకర్ నుంచి స్టేయిన్ లెస్ స్టీల్, వెల్ర్కో వరకు ఇలా కనిపెట్టినవే ఉన్నాయి. అనుకోకుండా కనిపెట్టినవే ఇప్పుడు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.



ఇర్విన్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఓ పీహెచ్‌డీ స్టూడెంట్, సైంటిస్టు కూడా అనుకోకుండానే ఓ వర్చువల్ రీఛార్జబుల్ బ్యాటరీని కనిపెట్టింది. తాను ల్యాబరేటరీలో నానో వైర్లతో ప్రయోగం చేసే క్రమంలో రీఛార్జబుల్ బ్యాటరీని కనిపెట్టింది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ కొన్ని దశబ్దాల వరకు ఎప్పటికీ అలానే ఉంటుందంట..

 Nanowire బ్యాటరీ లైఫ్ టైం ఎక్కువ :

సాధారణంగా ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్లలో లోపల lithium-ion battery వాడుతుంటారు.ఈ బ్యాటరీలు కేవలం 300 నుంచి 500 ఛార్జ్ డిఛార్జ్ సైకిల్స్ మాత్రమే పనిచేసేలా డిజైన్ చేశారు. అది కూడా మన వాడకంపైనే బ్యాటరీల లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఒక ఫుల్ డిఛార్జ్ సైకిల్ అనేది 5 నుంచి 10 డిశ్చార్జ్ సైకిళ్లకు సమానంగా చెప్పవచ్చు. వాస్తవానికి పాక్షిక డిశ్చార్జ్ సైకిల్స్.. బ్యాటరీ లైఫ్ పెంచుకునేందుకు సిఫార్సు చేస్తుంటారు. అందుకే ఎప్పుడూ బ్యాటరీలను సాధ్యమైనంతవరకు పూర్తిగా అయిపోయేంతవరకు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.



సాధారణంగా Li-ion battery లకు ఒక లైఫ్ టైమ్ ఉంటుంది.. ఆ తర్వాత ఛార్జింగ్ ఆగిపోతాయి.. ఇలాంటి పనికిరాని బ్యాటరీల వ్యర్థాలు కూడా పర్యావరణంలో ఎక్కువ చేరిపోతున్నాయి. ఒక విధంగా పర్యావరణ కాల్యుషానికి కూడా కారణమవుతున్నాయని చెప్పవచ్చు. అందుకే సైంటిస్టులు ఎప్పుడూ ఎల్లకాలం పనిచేసే బ్యాటరీలను కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తూనే ఉంటారు.. ఎన్నిసార్లు ఛార్జింగ్ చేసినా దీర్ఘకాలం పనిచేసేలా బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నానోవైర్ బ్యాటరీలంటే :

ఇప్పుడు అలాంటి బ్యాటరీనే ఓ సైంటిస్టు అనుకోకుండా కనిపెట్టేసింది.. అది కూడా nanowire బ్యాటరీ.. ఇర్విన్ యూనివర్శిటీ కాలిఫోర్నియాలో 2016లో పీహెచ్ డీ స్టూడెంట్ గా చేరిన Mya Le Thai అనే సైంటిస్టు.. ఈ నానోవైర్ బ్యాటరీని కనిపెట్టింది. బ్యాటరీలో వాడే పదార్థాల్లో డయామీటర్ లో 100 నానో మీటర్ల కంటే అతిచిన్న పరిమాణం కలిగిన వైర్లతో కలిగి ఉంటాయి వీటినే నానోవైర్లు అని పిలుస్తారు. కానీ, పట్టుకుని లాగితే తెగిపోయేలా చాలా పెళుసుగా ఉంటాయి.

10వేలకు పైగా రీఛార్జ్ సైకిల్ కెపాసిటీ :

ఎక్కువసార్లు బ్యాటరీలను చార్జింగ్ చేసిన తర్వాత వెంటనే తెగిపోతుంటాయి. ఒకరోజున నానోవైర్ జెల్ కెపాసిటర్ సాయంతో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ను తయారుచేసింది Le Thai.. ఈ బ్యాటరీని అనేకసార్లు టెస్టింగ్ చేసింది. nanowire battery అద్భుతంగా 10వేలకు పైగా రీఛార్జ్ సైకిల్ సామర్థ్యం కలిగి ఉందని గుర్తించింది. ఎంతకీ ఛార్జింగ్ రన్ అవుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత 30వేలకు పైగా ఛార్జింగ్ సైకిల్స్ వరకు రన్ అవుతూనే ఉంది.

Scientist accidentally invents a rechargeable battery that could virtually last forever

ఈ బ్యాటరీలో ఉపయోగించిన జెల్.. శనగ వెన్న మాదిరిగా ఉంటుంది. మాంగనీస్ ఆక్సైడ్ ద్వారా నానోవైర్లకు పూతగా వేస్తారు. చాలా సాఫ్ట్ గా పనిచేస్తుంది. దీనికారణంగా వైర్లు తెగిపోకుండా ఉంటాయి.. జెల్ ఆధారిత నానోవైర్ బ్యాటరీలపై లి థాయ్ సహా ఆమె పరిశోధక బృందం మరిన్ని ప్రయోగాలు చేస్తోంది.



ప్రస్తుత బ్యాటరీ మార్కెట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు ఎక్కువ లైఫ్ ఉండే బ్యాటరీలకు డిమాండ్ ఉంటుంది. లిథియం లయన్ బ్యాటరీలతో పోలిస్తే నానోవైర్ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. రాబోయే రోజుల్లో nanowire battery market 2021 నుంచి 53 మిలియన్ల డాలర్ల నుంచి 2026 నాటికి 243 మిలియన్ డాలర్ల మార్కెట్ విస్తరించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.