NASA Dart Mission : డార్ట్ మిషన్ సక్సెస్ .. భూమివైపు దూసుకొచ్చిన గ్రహశకలాన్ని తిప్పి కొట్టిన నాసా

భూమివైపు దూసుకొచ్చిన గ్రహశకలాన్ని తిప్పి కొట్టింది నాసా. డార్ట్ మిషన్ ప్రాజెక్టుతో ఈ ఘనత సాధించింది. ఇకనుంచి గ్రహశకలాల ముప్పును తప్పించటానికి ఈ ప్రయోగం ఓ సక్సెస్ గా మారింది.

NASA Dart Mission : డార్ట్ మిషన్ సక్సెస్ .. భూమివైపు దూసుకొచ్చిన గ్రహశకలాన్ని తిప్పి కొట్టిన నాసా

NASA Dart Mission Success

NASA Dart Mission Success : భూగ్రహానికి చేరువలో వేలసంఖ్యలో అంతరిక్ష శిలలు ఉన్నాయి. వాటిలో ఏదైనా భూమిని తాకితే పెను విధ్వంసమే… ఆ గ్రహ శకలాల నుంచి మానవాళిని రక్షించేదిశగా అమెరికా అంతరిక్షసంస్థ నాసా ఓ అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టింది. భూమిని ఢీకొనే అవకాశాలున్న ఆస్ట్రాయిడ్‌ ను తిప్పి కొట్టే ప్రయోగాలు చేపట్టి విజయవంతమైంది. దాంట్లో భాగంగానే నాసా చేపట్టిన ‘డార్ట్’ మిషన్ విజయవంతమైంది. గ్రహశకలం డైమోర్ఫోస్‌ అనే గ్రహశకలం దిశ మార్చేసింది నాసా.పది నెలలుగా అంతరిక్షంలో తిరుగుతున్న ‘డార్ట్’ డైమోర్ఫోస్‌ దారి మళ్లించింది. 530 అడుగుల వెడల్పు ఉన్న డైమోర్ఫోస్‌ భూమికి అతిచేరువలోకి వచ్చింది. ఏ క్షణమైనా భూమిని ఢీకొనే ప్రమాదం నెలకొన్ని తరుణంలో నాసా చేపట్టిన డార్ట్ మిషన్ డైమోర్ఫోస్ అంతు చూసింది. దారి మళ్లేలా చేసింది.ప్రపంచంలోనే ఇది తొలి ప్రయోగం కావటం విశేషం.

వివరాల్లోకి వెళితే..అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ) గ్రహశకలమైన డైమోర్ఫోస్‌ను తాకింది. గ్రహశకల ప్రమాదాల నుంచి భూమిని రక్షించేందుకు ఉద్దేశించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మిషన్ ఇది. పది నెలలుగా అంతరిక్షంలో తిరుగుతున్న ‘డార్ట్’ మంగళవారం (సెప్టెంబర్ 2022)ఈ విజయం సాధించింది. ఈ ఘతన గురించి మేరీల్యాండ్‌లోని లారెల్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) మిషన్ కంట్రోల్ ప్రకటించింది.

530 అడుగుల (160 మీటర్లు) వెడల్పు ఉన్న డైమోర్ఫోస్‌ గమనాన్ని మార్చేందుకు డార్ట్ ఉద్దేశపూర్వకంగానే దానిని ఢీకొట్టింది. భూమికి 7 మిలియన్ మైళ్ల (11 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఏపీఎల్ తెలిపింది. డైమోర్ఫోస్ గ్రహశకలం డిడిమోస్ అనే 2,560 అడుగుల (780 మీటర్ల) భారీ గ్రహశకలం చుట్టూ తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, దీనివల్ల భూ గ్రహానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు.

ఈ వన్ వే ట్రిప్ ద్వారా వ్యోమనౌకను నాసా విజయవంతంగా నేవిగేట్ చేయగలదని నిరూపితమైంది. ఉద్దేశపూర్వకంగా గ్రహశకలాన్ని ఢీకొట్టే ఈ టెక్నిక్‌ను ‘కైనటిక్’ ఇంపాక్ట్ అని పిలుస్తారు. డార్ట్ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా భవిష్యత్తులో భూమి వైపుగా దూసుకొచ్చి భారీ విధ్వంసం సృష్టించగల గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించే అవకాశం చిక్కింది.