Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం

ఈ గ్రహశకలం అంతరిక్షంలో ఏకంగా గంటకు 49వేల 513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు.

Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం

Asteroid

asteroid Earth : తీవ్రమైన నష్టం కలిగించగలిగే ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) వెల్లడించింది. ఆ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని… మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందని తెలిపారు. ఈ గ్రహశకలం అంతరిక్షంలో ఏకంగా గంటకు 49వేల 513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు.

అందుకే దీన్ని ‘‘పొటెన్షియల్లీ హజార్డస్’’ (ప్రమాదకరమైన) గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది.. ఈసారి భూమికి 51,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గురువారం ఈ గ్రహశకలం భూమిని దాటేస్తుందని చెబుతున్నారు.

NASA : ప్రపంచ ఎకానమీల కంటే విలువైన గ్రహశకలం.. భూమ్మీదకు తెస్తే అందరూ బిలియనీర్లే!

అయితే ఇది ఇలా భూమి సమీపంలోకి రావడం ఇదేమీ తొలిసారి కాదు. 2013లో కూడా ఇలాగే భూమి వైపు దూసుకొచ్చిన ఈ ఆస్టరాయిడ్.. అప్పుడు 78,88,295 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయింది. ఇదే గ్రహశకలం మరోసారి 2033 జులై 14న భూమి దగ్గరకు వస్తుందని, అప్పుడు భూమి నుంచి 1.91 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.