Oxygen Pipeline On Moon : చంద్రుడిపై ఆక్సిజన్ పైప్ లైన్.. ఏర్పాటుకు సిద్దమవుతున్న నాసా

చంద్రుడిపై ఆక్సిజన్ పైప్ లైన్ వేయనున్నారు. భవిష్యత్ లో చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధృవం చుట్టు పక్కల ప్రాంతాలకు ఆక్సిజ్ సరఫరా కోసం పైల్ లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తోంది.

Oxygen Pipeline On Moon : చంద్రుడిపై ఆక్సిజన్ పైప్ లైన్.. ఏర్పాటుకు సిద్దమవుతున్న నాసా

MOON (1)

Oxygen Pipeline On Moon : చంద్రుడిపై ఆక్సిజన్ పైప్ లైన్ వేయనున్నారు. భవిష్యత్ లో చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధృవం చుట్టు పక్కల ప్రాంతాలకు ఆక్సిజ్ సరఫరా కోసం పైల్ లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తోంది. రోవర్ల ద్వారా ఆక్సిజన్ పరఫరా చేసేందుకు ప్రస్తుతం నాసా వద్ద ఉన్న ప్రణాళికతో ఇబ్బందులు ఎదురవుతాయని లూనార్ రిసోర్సెస్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ పీటర్ కుర్రెరి పేర్కొన్నారు.

కాబట్టి చంద్రుడిపై పైప్ లైన్ వేయడం ఉత్తమమని లూనార్ రిసోర్సెస్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ పీటర్ కుర్రెరి నాసాకు సూచించారు. మంచు వెలికితీత కేంద్రం వద్ద ఈ పైప్ లైన్ వేయాలని నాసా యోచిస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే భవిష్యత్ లో వ్యోమగాములకు చాలా ఉపయోగపడుతుందని
పీటర్ కుర్రెరి తెలిపారు.