అంగారకుడిపై తీసిన హైక్వాలిటీ హెచ్‌డీ ఫొటోలను పంపిన నాసా పర్సెవరెన్స్ రోవర్

అంగారకుడిపై తీసిన హైక్వాలిటీ హెచ్‌డీ ఫొటోలను పంపిన నాసా పర్సెవరెన్స్ రోవర్

nasa:అంగారకుడిపై జీవం ఉందో లేదో తేల్చేసేందుకు అమెరికా అంతర్జాతీయ పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మార్స్ మిషన్ విజయవంతమైంది. పర్సెవరెన్స్ అనే రోవర్ మార్స్ ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయింది.

mars rover

అప్పటినుంచి నాసా రోవర్ అంగారకుడికి సంబంధించి ఫొటోలను కాప్చర్ చేసి భూమిపైకి పంపిస్తోంది. ఫస్ట్ 360-డిగ్రీ పనోరమా ఫొటోలను నాసా రోవర్ విడుదల చేసింది. మాస్ట్ క్యామ్-z అనే డ్యుయల్ కెమెరా సిస్టమ్ ద్వారా జూమ్ ఫంక్షనాలిటీతో ఇది పనిచేస్తుంది.

నాసా పర్సెవరెన్స్ రోవర్ మార్స్ ఫొటోలను ఒక్కొక్కటిగా భూమిపై మిషన్ కంట్రోల్ కు పంపిస్తోంది. మాస్ట్ క్యామ్-Z డ్యుయల్ కెమెరా సిస్టమ్ పంపిన మార్స్ ఫొటోలను నాసా రిలీజ్ చేసింది. మాస్ట్ 360 డిగ్రీల కోణంలో దాదాపు 142 వేర్వేరు మార్స్ ఫొటోలను రికార్డు చేసి పంపింది.

ఇందులో జంట జూమబుల్ కెమెరాలతో పనిచేసే పర్సెవరెన్స్ రోవర్ హై డెఫినేషన్ వీడియోలను రికార్డు చేయగలదు. అంగారకుడి ఉపరితలంపై పనోరామిక్ కలర్, త్రిడీ ఫొటోలను తీయగలదు.

mars rover

ఫస్ట్ హై డెఫినేషన్ పనోరామా కెమెరాలో బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిన సరస్సుకు సంబంధించి ఆనవాళ్లను రికార్డు చేసింది. మాస్ట్ క్యామ్-Z లో ఉండే రెండు కెమెరాలు కంటికి 2 మీటర్ల దూరంలో కనిపించే వస్తువులను సులభంగా ఫొటోలు తీయగలవు. డిజిటల్ హెచ్ డీ కెమెరాలానే కలర్ ఫుల్ ఫొటోలను హైక్వాలిటీతో అందించగలదు.