NASA : హ్యాండ్ ఆఫ్ గాడ్… సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న నాసా చిత్రం

అంతరిక్షం.. ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యాలు, అద్భుతాలతో నిండి ఉంది. అంతరిక్షంలో అందం అసమానమైనది. కొన్నిసార్లు అలాంటి అందాన్ని చూసినప్పుడు మైమరచిపోకుండా ఉండలేము. ప్రకాశవంతమైన ఖగో

NASA : హ్యాండ్ ఆఫ్ గాడ్… సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న నాసా చిత్రం

Nasa

NASA : అంతరిక్షం.. ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యాలు, అద్భుతాలతో నిండి ఉంది. అంతరిక్షంలో అందం అసమానమైనది. కొన్నిసార్లు అలాంటి అందాన్ని చూసినప్పుడు మైమరచిపోకుండా ఉండలేము. ప్రకాశవంతమైన ఖగోళంలో ఎన్నో మిస్టరీలు. అంతరిక్షంలోని పలు చిత్రాలను తన సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా నాసా క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని మనల్ని ఎంతగానో ఆశ్యర్యానికి గురి చేస్తాయి. ఇది నిజమేనా? అనే అనుమానం కలగక మానదు.

Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?

తాజాగా నాసా పోస్ట్ చేసిన ఒక చిత్రం సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తోంది. హ్యాండ్ ఆఫ్ గాడ్ పేరుతో నాసా ఓ ఇమేజ్ విడుదల చేసింది. ఈ చిత్రం నెటిజన్లను ఆశ్యర్యపరుస్తోంది. ఆ చిత్రం ఓ చేతిని తలపిస్తోంది.

నాసా ఈ చిత్రం గురించి వివరణ ఇచ్చింది. అదొక గోల్డన్ స్ట్రక్చర్. పల్సర్ నుంచి బ్లో అయిన ఎనర్జీ, పార్టికల్స్ సమూహం. ఒక నక్షత్రం పేలిన తర్వాత పల్సర్ మిగిలిపోయింది. ఈ పల్సర్‌ని PSR B1509-58 అంటారు. డైమటర్లలో ఇది దాదాపు 19 కిలోమీటర్లు. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే అది సెకనుకు 7 సార్లు తన చుట్టూ తాను తిరుగుతోంది. ఇది భూమికి 17వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నెటిజన్లు ఈ చిత్రాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వర్ణిస్తున్నారు.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?

దీన్ని ”మిడాస్ చేతి” అని పిలవాలని ఒక యూజర్ చెప్పాడు. మిడాస్ ఓ రాజు. అతడు ఎక్కడ తాకితే అక్కడంతా బంగారంగా మారుతుంది. ఇక అది పరమశివుడి మూడో కన్ను అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ ఇమేజ్ వైరల్ గా మారింది.