అంతరిక్షంలోని డిజైన్స్ : మార్స్ పై మొదటి ఇల్లు ఇలా ఉంటుంది

జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : May 16, 2019 / 11:22 AM IST
అంతరిక్షంలోని డిజైన్స్ : మార్స్ పై మొదటి ఇల్లు ఇలా ఉంటుంది

జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్ష వ్యోమగామీలతో చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన మానవుడు.. ఇతర గ్రహాల్లో కూడా జీవరాశి ఉంటుందనే కోణంలో విస్త్రృతంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల చంద్రుడిపై నీళ్ల జాడ ఉన్నాయని కూడా గుర్తించారు. భూగ్రహం తర్వాత మానవులు జీవించడానికి అనువైన గ్రహం.. మార్స్ (అంగారకుడు)అని ఎన్నోఏళ్లుగా చెబుతూ వస్తున్నారు. 

అంగారకుడిపై జీవం.. సాధ్యేమేనా?
అంగారక గ్రహంపై జీవరాశి ఉందా? అనే కోణంలో ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. నీళ్లు ఉంటే.. కచ్చితంగా జీవరాశి ఉండే అవకాశాలే ఎక్కువని విశ్వసిస్తుంటారు. అదేగాని నిజమైతే.. అంగారకుడిలో మానవులు జీవించడం సాధ్యమేనా? అక్కడికి రోదసీయాత్రికులు వెళ్తే అక్కడ మనుగడ ఎలా సాగించగలరనే సందేహాలకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 3డీ ప్రింటెడ్ ప్రొటోటైప్ తో సమాధానమిచ్చింది. అంగారకుడిపై హ్యుమన్ కాలనీ నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఓ రీసెర్చ్ చేసింది. సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్తే.. రోదసీ యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రత్యేకమైన ష్యూట్ ను ధరించాల్సి ఉంటుంది. 

నాసా కాంటెస్ట్.. మార్షా హౌస్ కు టాప్ ప్రైజ్ :
వ్యోమగామీలు మార్స్ పై జీవించేందుకు సరైన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే అక్కడ జీవించడం కష్టసాధ్యమే. ఇందుకోసం.. స్పెస్ ఏజెన్సీ ఇటీవల ఓ కాంటెస్ట్ నిర్వహించింది. అదే.. మార్స్ 3D-ప్రింటెడ్ హౌస్ ఛాలెంజ్. ఈ పోటీలో పాల్గొనేవారు.. అంగారక గ్రహంపై నిర్మించిన స్కేల్ మోడల్ హౌస్ ను వ్యోమగామీలు వాడుకోవాల్సి ఉంటుంది.

ఇందులో మొత్తం 60మంది పోటీదారులు ఉంటారు. ఈ పోటీలో ఆర్కిటెక్చురల్ అండ్ టెక్నాలజీ డిజైన్ ఏజెన్సీ AI స్పెస్ ఫ్యాక్టరీ టాప్ ప్రైజ్ (5లక్షల డాలర్లు) గెలుచుకుంది. అదే.. మార్షా మార్స్ హౌస్. చివరి పోటీ జరుగుతున్న సమయంలో తమ 3డీ ప్రింటెడ్ ప్రొటోటైప్ ను 15అడుగుల పొడువు ఉండేలా నిర్మించింది. 

దీంతో ఈ స్పెస్ ఫ్యాక్టరీకి 5లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. రెండో ప్లేస్ లో పెన్న్ స్లైవేనియా స్టేట్ యూనివర్శటీ 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కించుకుంది. ఈ తరహా నివాస స్థలాన్ని మార్స్ లో ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడికి తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్స్ పై దొరికే నేచురల్ మెటేరియల్స్ ను రీసైకిలింగ్ చేసుకోవచ్చునని నాసా తెలిపింది. అయితే.. మనుషుల అవసరం లేకుండా కొన్నింటిని రోబోలే నిర్మిస్తాయని పేర్కొంది. మార్షా సృష్టించిన ఈ త్రిడీ హౌస్ కు మూడు కిటికీలు, లైటింగ్ ఎఫెక్ట్ మరిన్నో ఫీచర్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మార్స్ పై మానవులు వెళ్తే అక్కడ వారి మొదటి ఇళ్లు ఇలానే ఉంటాయని నాసా తెలిపింది.