Nasal vaccines: ముక్కు ద్వారా వ్యాక్సిన్.. అధ్యయనాలేం చెప్తున్నాయి?

యావత్‌ ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిని నాసల్‌ వ్యాక్సిన్(intranasal vaccine)తో మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముక్కుద్వారా వేసుకునే నాసల్‌ వ్యాక్సిన్‌లు.. వైరస్‌పై మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

Nasal vaccines: ముక్కు ద్వారా వ్యాక్సిన్.. అధ్యయనాలేం చెప్తున్నాయి?

Nasal Vaccines

Nasal vaccines: యావత్‌ ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిని నాసల్‌ వ్యాక్సిన్(intranasal vaccine)తో మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. సిరంజీ ద్వారా మజిల్స్ (Intramuscular Vaccine)కి ఇచ్చే టీకాల కంటే ముక్కుద్వారా వేసుకునే నాసల్‌ వ్యాక్సిన్‌లు.. వైరస్‌పై మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోవిడ్ -19 టీకాలు క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగా వాటిలో ఏడు నాసల్ వ్యాక్సిన్ (intranasal vaccine)లు ఉన్నాయి. అందులో మన భారత్ బయోటెక్(Bharath Biotech) కూడా ఒకటి.

కాగా, సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త వ్యాసంలో బర్మింగ్‌హామ్ యూఏబీ(UAB)లోని అలబామా విశ్వవిద్యాలయం (Alabama) నుండి ఇద్దరు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ (intranasal vaccine)ను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలను పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు ఫ్రాన్ లండ్, ట్రాయ్ రాండాల్ క్లినికల్ ట్రయల్స్ కింద ఉన్న ఏడుగురు ఇంట్రానాసల్ టీకా అభ్యర్థులను పరీక్షించిన అనంతరం నాసల్ వ్యాక్సిన్(intranasal vaccine) ప్రయోజనాలు, సవాళ్లను వివరించారు.

ఇంట్రానాసల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల యొక్క ప్రయోజనాలు
యూఏబీ(UAB) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ నాసల్ వ్యాక్సిన్స్(intranasal vaccine) సూది రహితమైనవి కావడంతో మరింత విరివిగా వ్యాక్సిన్ తీసుకొనే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యాక్సిన్ తీసుకొనే ప్రదేశంలో సంక్రమణ నివారణ సాధ్యమని, శ్వాసకోశంలో శ్లేష్మ రోగనిరోధక శక్తిని పొందడం మహమ్మారిని మరింత ప్రభావితంగా ఎదుర్కోగలదని పేర్కొన్నారు. నాసల్ వ్యాక్సిన్ మజిల్ షాట్ కన్నా రెండు అదనపు పొరల రక్షణను ఇస్తుందని చెప్పారు.

ముక్కు ద్వారా ఇవ్వబడిన వ్యాక్సిన్ ఇమ్యునోగ్లోబులిన్ ఎ, శ్వాసకోశ శ్లేష్మంలోని రెసిడెంట్ మెమరీ బి, టి కణాలు ఆ ప్రదేశాలలో సంక్రమణకు అవరోధం కలిగిస్తాయని.. క్రాస్ రియాక్టివ్ రెసిడెంట్ మెమరీ బి, టి కణాలు వైరల్ వేరియంట్ సంక్రమణను ఇతర రోగనిరోధక కణాల కంటే ముందే ఎదుర్కొంటామని చెప్పారు.

ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ప్రతికూలతలు ఇవే
యూఏబీ(UAB) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఏడు ఇంట్రానాసల్ వ్యాక్సిన్(intranasal vaccine)లలో ఆరు వ్యాక్సిన్ లు వైరల్ వెక్టర్స్ కాగా ఇందులో మూడు వేర్వేరు అడెనోవైరస్ వెక్టర్స్, లైవ్-అటెన్యూయేటెడ్ ఇన్ఫ్లుఎంజా వైరస్, లైవ్-అటెన్యూయేటెడ్ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కాగా.. SARS-CoV-2 కోసం ఒక వ్యాక్సిన్ లైవ్-అటెన్యూయేటెడ్ అభివృద్ధి చేస్తుండగా ఒక టీకా మాత్రమే జడ ప్రోటీన్ సబ్యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు.

నాసల్‌ టీకాల్లో ఉపయోగించే హానిచేయని.. పారాఇన్‌ఫ్లూయెంజా వైరస్‌- పీఐవీ5, కరోనాను అడ్డుకునేందుకు సాయపడుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇది సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ ప్రొటిన్‌ను మానవ కణాల్లోకి చేరకుండా అడ్డుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా కొవిడ్‌ సోకే ప్రధాన మార్గం ముక్కు ద్వారా నాసల్‌ టీకాలను తీసుకోవడం వల్ల వైరస్‌ను ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. తద్వారా ప్రారంభందశలోనే వైరస్‌ పునరుత్పత్తిని నిలువరించొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.