Curfew In Sri Lanka : ఆందోళనలు హింసాత్మకం.. శ్రీలంకలో నిరవధిక కర్ఫ్యూ విధింపు

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Curfew In Sri Lanka : ఆందోళనలు హింసాత్మకం.. శ్రీలంకలో నిరవధిక కర్ఫ్యూ విధింపు

Curfew In Sri Lanka

Curfew In Sri Lanka : శ్రీలంకలో రోజురోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం శ్రీలంకను కుదిపేస్తోంది. ఈ సంక్షోభం ఆందోళనలు, హింసకు దారితీస్తోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనల కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. పరిస్థితులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, లాఠీలతో దాడి చేశారు. ఈ దాడుల్లో 78 మంది వరకు గాయపడ్డారు.

Mahinda Rajapaksa : ఆర్థిక సంక్షోభంలో లంక.. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా తప్పదా?

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో.. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అధికార నేతల రాజీనామాకు డిమాండ్ పెరుగుతోంది.

Nation Wide Curfew In Sri Lanka After Clashes, 78 Injured

Nation Wide Curfew In Sri Lanka After Clashes, 78 Injured

ఈ క్రమంలోనే సోమవారం అధ్యక్ష కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న వారిపై రాజపక్స విధేయులు కర్రలతో దాడికి దిగినట్లు సమాచారం. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్స.. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభ నివారణకు ఆర్థిక పరిష్కారం అవసరమని.. ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ట్విట్టర్ లో తెలిపారు.

Sri Lanka: పెరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. లంకలో మరోసారి ఎమర్జెన్సీ

ఇది ఇలా ఉంటే, కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే రాజీనామా ప్రకటించారు. విపక్షాల నిరసనలతో ఆయన గద్దె దిగారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంసిద్ధత తెలిపారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున ప్రజలు నిరసనలకు దిగుతున్నారు.