నవాజ్ షరీఫ్ కు బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2019 / 01:07 PM IST
నవాజ్ షరీఫ్ కు బెయిల్

అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది.  మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం షరీఫ్ కు బెయిలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also : అవినీతి అంతం : ప్రమాణస్వీకారం చేసిన లోక్ పాల్ సభ్యులు

దేశంలోనే షరీఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని, డాక్టర్ల సూచనలు లేకుండా దేశం వదిలి వెళ్లడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది.బెయిలు సమయం ముగిసిన తర్వాత షరీష్ స్వయంగా కోర్టులో సరెండర్ అవ్వాలని ఆదేశించింది.అల్ అజీజియా అవినీతి కేసులో  గత ఏడాది అకౌంటబులిటీ కోర్టు షరీఫ్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నవాజ్ ను లాహోర్ లోని కోట్ లక్ పత్ జైలులో ఉంచారు.